Begin typing your search above and press return to search.

సైఫ్ జెవెల్ థీఫ్ ఎలా ఉంది..?

బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించిన ఈ సినిమాను కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు

By:  Tupaki Desk   |   25 April 2025 10:56 PM IST
సైఫ్ జెవెల్ థీఫ్ ఎలా ఉంది..?
X

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జెవెల్ థీఫ్. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించిన ఈ సినిమాను కూకీ గులాటి, రాబీ గ్రేవాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు. మామూలుగా డిజిటల్ కంటెంట్ లో ఇలాంటి హెయిస్ట్ సినిమాలను ఎక్కువగా చూస్తారు.

ఇంతకీ అసలు ఈ జెవెల్ థీఫ్ కథ ఏంటంటే.. రెహాన్ రాయ్ (సైఫ్ అలీ ఖాన్) డైమండ్ ని చోరీ చేస్తూ ఉంటాడు. ప్రపంచ దేశాలు తిరిగే అతనికి బుడా పెస్త్ లో అతని బ్రదర్ కలిసి తన తండ్రి మోసపోయిన విషయాన్ని అతనికి చెబుతాడు. ఆర్ట్ కలెక్టర్ ముసుగులో క్రిమినల్ రంజన్ (జైదీప్ అహ్లావత్) ని ఓకే చేస్తేనే తండ్రి ఆ ప్రాబ్లెం నుంచి సేఫ్ అవుతాడని చెబుతాడు. ఐతే ఆ డీల్ ఏంటంటే విలువైన డైమండ్ రెడ్ సన్ ని రాబరీ చేయడమే.. ముంబై మ్యూజియంలో భారీ సెక్యూరిటీ మధ్య 500 కోట్ల పైన విలువ ఉన్న ఆ డైమండ్ ని రెహాన్ ఎలా చోరీ చేశాడు.. రెహాన్ ని అరెస్ట్ చేయాలని చూస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అతన్ని పట్టుకున్నారా అన్నది జెవెల్ థీఫ్ కథ.

డిజిటల్ ఆడియన్స్ కి ఇలాంటి సినిమాలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఐతే ఈ సినిమా ఆరంభం బాగుంది.. థెఫ్టింగ్ టైం స్కెచ్ మిగతా యాక్షన్ పార్ట్ బాగుంది కానీ ఆ తర్వాత కథనం ఆడియన్స్ ని మెప్పించలేదు. కొన్ని సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. బాలీవుడ్ లో ఇలా డైమండ్ థెఫ్టింగ్ సినిమాల్లో ధూమ్ సినిమాలు గుర్తుచేస్తాయి.. ఆ తరహా భారీ తనం ఉన్నా కూడా కథనం కాస్త ఇంప్రెసివ్ గా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఈమధ్య అన్ని ఓటీటీ సంస్థలు తమ సినిమాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. కాబట్టి ఆడియన్స్ అంతా ఎంటర్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రాబరీ బ్యాక్ డ్రాప్ హెయిస్ట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంటుంది. జెవెల్ థీఫ్ కథ చాలా సింపుల్ గా అనిపించినా స్క్రీన్ ప్లే కొంతమేర ఎంగేజ్ చేసింది. ఐతే ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే తప్పకుండా ఇది ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్ పీరియన్స్ అందించే ఛాన్స్ ఉండేది.