స్టార్ హీరో కుక్కను తినేశాడు.. అరిచేసిన పొరుగింటావిడ!
ఉన్న ఫలంగా ఆ బంగ్లాను ఖాళీ చేసి దూరంగా అద్దె గదికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారితో మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్.
By: Tupaki Desk | 30 March 2025 8:30 AM ISTకన్న బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించే పెట్ లవర్స్ ఉన్నారు. కుక్కలు పిల్లుల్ని ప్రేమించడంలో వీరి తర్వాతే. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది బాలీవుడ్ నటి షీబా అగర్వాల్. తన ఇన్ స్టా చూస్తే చాలు.. ఇంట్లో ఎప్పుడూ డజను పెట్స్ తన చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. అయితే అలాంటి ఒక పెంపుడు కుక్క పిల్లను అర్థాంతరంగా ఒక హీరోగారి కుక్క కరిచేయడంతో మరణించింది. పొరుగింట్లో ఉంటున్న స్టార్ హీరో సైఫ్ ఖాన్ కుక్క తన పప్పీని కరిచి చంపేసాక.. ఈ నటి గుండె పగిలేలా ఏడ్చింది. అంతేనా..? ఆ హీరోని అతడి భార్యను తీవ్రంగా తిట్టేసింది. పెద్ద గొడవకు దిగింది. అంతేకాదు.. స్టార్ కపుల్ తో స్నేహాన్ని వెంటనే కట్ చేసింది. ఉన్న ఫలంగా ఆ బంగ్లాను ఖాళీ చేసి దూరంగా అద్దె గదికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారితో మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్.
ఈ మొత్తం ఎపిసోడ్ లో కుక్కల్ని అమితంగా ప్రేమించే ఆ నటి పేరు షీబా ఆకాష్. పేరుకు తగ్గట్టే మూగ జీవాల పెంపకం విషయంలో ఆకాశం అంత విశాలమైన హృదయం ఆమెకు ఉందని తన ఇన్ స్టా చూసి చెప్పొచ్చు. నిజానికి తన పొరుగున ఉండే సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ లకు షీబా ఎంతో సన్నిహితురాలు. వారంటే అమితమైన ప్రేమ తనకు. స్నేహితులు పైగా ఇరుగుపొరుగున నివశించారు.. ఒకే కాంప్లెక్స్ లో నివసించామని షీబా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, సైఫ్ - అమృత జంట జర్మన్ షెఫర్డ్ కుక్క షీబా పెంపుడు కుక్క మీద పడి కరిచి చంపడంతో వారి మధ్య సంబంధాలు తెగిపోయాయి.
ఇటీవలి ఇంటర్వ్యూలో షీబా ఈ సంఘటన తర్వాత సైఫ్ - అమృతతో మాట్లాడటం మానేశానని చెప్పింది. ఆ తర్వాత రెండు సార్లు తనను కలిసిన సైఫ్ సారీ చెప్పాడని కూడా షీబా వెల్లడించింది. కానీ తన పెంపుడు కుక్కను చంపేసినందున గుండె పగిలిపోయిందని ఆవేదన చెందింది. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్లిపోయింది. ఇష్టమైన పెంపుడు జంతువును కోల్పోవడం అంటే సంబంధాన్ని కోల్పోయినట్లే`` అని షీబా ఆవేదన చెందింది. ఇక గత ఇంటర్వ్యూలో సైఫ్ తో తనకు రిలేషన్ ఉందని కూడా షీబా ధృవీకరించింది. అప్పట్లో స్నేహంగా ఉండేవాళ్లం.. కానీ ఇప్పుడు లేదు! అని తెలిపింది. షీబా బాలీవుడ్ లో ప్రముఖ నటి. కథానాయికగా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించారు.
ఆసక్తికరంగా షీబా కుక్క పిల్లను సైఫ్ ఖాన్ పెంపుడు కుక్క కరిచి చంపేసిన సమయంలో సైఫ్ అతడి భార్య అమృత ఇద్దరూ ఇంట్లో లేరట. ఈ విషయాన్ని షీబా భర్త ఆకాష్ దీప్ ధృవీకరించారు. ఈ గొడవలో అతడు సైఫ్ వెంట ఉన్నాడు. తన భార్యను సముదాయించాడు.
