ఆదిపురుష్ వివాదంపై సైఫ్ వివరణ
ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్.
By: Tupaki Desk | 6 May 2025 7:53 AMప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా నటించాడు. రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇండియన్ సినీ హిస్టరీలో మర్చిపోలేని సినిమాల్లో ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ కూడా ఒకటి.
ఈ సినిమా గురించి మొన్నా మధ్య సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, తన కొడుకు తైమూర్ అలీ ఖాన్ కు ఈ సినిమా చూడమని చెప్పినందుకు సారీ చెప్పానని చెప్పడంతో అతని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో ఇప్పుడు సైఫ్ తన మాటను మార్చుకుని, తన కొడుక్కి తాను క్షమాపణలు చెప్పింది, తాను రావణాసురుడి లాంటి చెడు పాత్ర పోషించినందుకని, సినిమా చూడమని చెప్పినందుకు కాదని క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా తన ఓటీటీ రిలీజ్ జ్యువెల్ థీఫ్ ప్రమోషన్స్ లో తాను, తన కొడుకు ఆదిపురుష్ చూస్తున్న టైమ్ ను గుర్తు చేసుకున్నాడు.
సైఫ్ ముందు చేసిన వ్యాఖ్యలు వేరు. ఇప్పుడు తన కామెంట్స్ నెట్టింట వైరలై, అందరూ అతన్ని విమర్శిస్తున్న కారణంతోనే ఆయన మాట మార్చి రావణాసురుడి లాంటి పాత్ర చేసినందుకు కొడుక్కి సారీ చెప్పానని చెప్తున్నాడు. సినిమాలో తాను గుర్రుమని కేకలేస్తూ, కనిపించిన ప్రతీ ఒక్కరినీ కొట్టానని, మరోసారి అలాంటి పాత్రలు చేయొద్దని, హీరోగా నటించమని తన కొడుకు తనకు చెప్పినట్టు సైఫ్ తెలిపాడు.