Begin typing your search above and press return to search.

వీడియో: బ‌ర్త్ డే బ్యూటీ స‌యీ థైస్లిట్ లుక్

అల్ట్రా స్టైలిష్ లుక్ ల‌తో గుండెల్లో గుబులు పెంచ‌డం ఎలానో 'దబాంగ్ 3' బ్యూటీ స‌యీముఖ‌ర్జీకి బాగా తెలుసు. ఇప్పుడు బ‌ర్త్ డే పార్టీలోకి స‌యీ ఎంట‌రైన తీరు బోయ్స్ లో కిక్కు పెంచింది.

By:  Tupaki Desk   |   24 Dec 2023 4:24 AM GMT
వీడియో: బ‌ర్త్ డే బ్యూటీ స‌యీ థైస్లిట్ లుక్
X

అల్ట్రా స్టైలిష్ లుక్ ల‌తో గుండెల్లో గుబులు పెంచ‌డం ఎలానో 'దబాంగ్ 3' బ్యూటీ స‌యీముఖ‌ర్జీకి బాగా తెలుసు. ఇప్పుడు బ‌ర్త్ డే పార్టీలోకి స‌యీ ఎంట‌రైన తీరు బోయ్స్ లో కిక్కు పెంచింది. సిమెంట్ క‌ల‌ర్ లెదర్ ఫ్రాకులో మ‌తులు చెడ‌గొట్టింది. బ‌ర్త్ డే పార్టీకి సంబంధించి మ‌రింత‌గా వివ‌రాల్లోకి వెళితే.. 'మేజర్'-'దబాంగ్ 3' చిత్రాల నాయిక సయీ మంజ్రేకర్ తన 22వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా త‌న‌ కుటుంబ స‌భ్యులు, కొంద‌రు స్నేహితులతో తన ఇంటిలో ఒక పార్టీని నిర్వహిస్తోంది.

ఈ రోజుకోసం తన ప్రణాళికల గురించి స‌యీ మాట్లాడుతూ ''నా 22వ పుట్టినరోజు కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను ప్రతి సంవత్సరం మాదిరిగానే నా చిన్ననాటి స్నేహితులు, బంధువులు , కుటుంబ సభ్యులతో ఇంట్లో సింపుల్ గా పార్టీ జరుపుకుంటాను'' అని తెలిపింది. ప్రతి సంవత్సరం మేము ఒకే పాటలు వింటాము. ఒకే ఆహారం తింటాం. అదే పాటలకు నృత్యం చేస్తాం. అవే ఆటలు ఆడతాం. కాబట్టి ఇది నా ప్రధాన జ్ఞాపకాలలో ఒకటిగా ఉండే అందమైన, అందమైన ఆచారంగా మారింది'' అని తెలిపింది. నేను చిన్నప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉంటుంది. .అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. స‌యీ త్వరలో 'కుచ్ ఖట్టా హో జాయ్' చిత్రంలో గురు రంధవా సరసన నటిస్తోంది. అలాగే 'ఆరోన్ మైన్ కహాన్ దమ్ థా' అనే చిత్రంలోను న‌టించ‌నుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - టబుతో క‌లిసి న‌టించ‌నుంది. ఈ చిత్రంలో ఆసక్తికరమైన, భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో శంతను మహేశ్వరి కూడా నటించారు. 26 ఏప్రిల్ 2024న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అవుతుంది.