Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జ‌స్ట్ లుకింగ్ లైక్ ఏ WOW

ఈ లుక్ చూసాక ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ..జ‌స్ట్ లుకింగ్ లైక్ ఏ WOW అని అన్నాడు. ఈ కొత్త లుక్ గాళ్స్ లో స్ఫూర్తిని నింపుతోంది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 12:30 AM GMT
ఫోటో స్టోరి: జ‌స్ట్ లుకింగ్ లైక్ ఏ WOW
X

సయీ మంజ్రేకర్ వర్ధమాన నటి. బాలీవుడ్ - టాలీవుడ్ లో క‌థానాయిక‌గా అవ‌కాశాలు అందుకుంటోంది. స‌ల్మాన్ భాయ్ ద‌బాంగ్ 2లో ఈ భామ‌కు అవ‌కాశం ఇచ్చాడు. అటుపై స‌ల్మాన్ బావ గారైన ఆయుష్ శ‌ర్మ స‌ర‌స‌నా స‌యీ న‌టించింది. ముఖ్యంగా అడివి శేష్ స‌ర‌స‌న మేజ‌ర్ లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రాల్లో న‌టించాక స‌యీ మంజ్రేక‌ర్ పేరు మార్మోగింది. రామ్ స‌ర‌స‌న స్కంధలో న‌టించినా స‌యీపై ఆ ప్ర‌భావం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.


కుచ్ ఖ‌ట్టా హో జాయే అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఆరోన్ మై కాహ ద‌మ్ థా అనే చిత్రంలోను నటిస్తోంది. వీటికి సంబంధించిన మ‌రింత స‌మాచారం రావాల్సి ఉంది. మ‌రోవైపు స‌యీ మంజ్రేక‌ర్ ఇన్ స్టా ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. బాలీవుడ్ ఫ్యాష‌నిస్టాల‌లో ప‌ర్ఫెక్ట్ పిట్ హీరోయిన్ గా స‌యీ పేరు మార్మోగుతోంది.


ఫిట్ అండ్ ఫ్యాబ్ బాడీతో స‌యీ యువ‌త‌రం గుండెల్లో గుబులు రేపుతోంది. మ‌ఖ‌మ‌ల్ జాకెట్, బ్లాక్ శారీలో స‌యీ కిల్ల‌ర్ లుక్ హీటెక్కిస్తోంది. చీర‌లో థై స్లిట్ సొగ‌సును ఈ బ్యూటీ ఎలివేట్ చేసింది. వీట‌న్నిటినీ మించి బాడీని ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో మెయింటెయిన్ చేయ‌డం స‌యీకి పెద్ద ప్ల‌స్. ఈ లుక్ చూసాక ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానిస్తూ..జ‌స్ట్ లుకింగ్ లైక్ ఏ WOW అని అన్నాడు. ఈ కొత్త లుక్ గాళ్స్ లో స్ఫూర్తిని నింపుతోంది. అయితే ఈ లెవ‌ల్లో ఫిగర్‌ని మెయింటెయిన్ చేయడానికి స‌యీ ముఖ‌ర్జీ అనుసరించే కొన్ని చిట్కాలు ఇలా ఉన్నాయి:


- **బరువు శిక్షణ**: సయీ తన శరీరాన్ని టోన్ చేయడానికి వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. కొవ్వును కోల్పోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం .

- **కార్డియో**: స‌యీ ముఖ‌ర్జీ తన ఉదయాన్ని జిమ్ లో కార్డియోతో ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇందులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే స‌యీ వారానికి ఐదు సార్లు వర్క్ అవుట్ చేస్తారు.

- **మార్షల్ ఆర్ట్స్ - డ్యాన్స్**: ఇవి ఆమె ఫిట్‌నెస్ ను కాపాడుకోవ‌డంలో భాగమైన ఇతర కార్యకలాపాలు.

- ** చురుకైన నడక - సైక్లింగ్**: సయీ కూడా చురుకైన మార్నింగ్ వాక్‌కి వెళుతుంది. తనను తాను ఫిట్‌గా ..చక్కగా ఉంచుకోవడానికి సైక్లింగ్ చేస్తుంది.

- **లంచ్ అండ్ డిన్నర్**: సయీ తన అల్పాహారాన్ని దాటవేస్తుంది. ఆమె భోజనం కోసం సబ్జీ జోవర్ రోటీ తీసుకుంటుంది. రాత్రి భోజనంలో చేపలు లేదా చికెన్ తీసుకుంటుంది.

- **స్నాకింగ్**: అందాల న‌టి ఆరోగ్యకరమైన సాయంత్రం స్నాక్స్‌లో పండ్లు - చాచ్ ఉన్నాయి.

ఇవే చిట్కాలు పాటిస్తే మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడతాయి. స‌యీ మంజ్రేక‌ర్ ని మించే అందాన్ని సొంతం చేసుకోవ‌చ్చు!