Begin typing your search above and press return to search.

క్యూట్ బ్యూటీకి #RAPO అయినా ఒక‌టిస్తాడా?

అయితే శ్రీ‌లీల లాంటి ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్ ముందు తేలిపోకుండా ఉండాలంటే స‌యీ ముఖ‌ర్జీ చాలా హార్డ్ వ‌ర్క్ చేసి ఉండాలి.

By:  Tupaki Desk   |   27 Aug 2023 11:30 PM GMT
క్యూట్ బ్యూటీకి #RAPO అయినా ఒక‌టిస్తాడా?
X

సల్మాన్ ఖాన్ సరసన 'దబాంగ్ 3'లో న‌టించిన స‌యీ మంజ్రేక‌ర్ అటుపై టాలీవుడ్ లో వరుణ్ తేజ్ స‌ర‌స‌న‌ 'గ‌ని' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. క‌థానాయిక‌గా తొలి రెండు ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఆరంగేట్రాలు నిరాశ‌ప‌రిచాయి. అయితే అడివి శేష్ స‌ర‌స‌న న‌టించిన పాన్ ఇండియా చిత్రం 'మేజ‌ర్' స‌యీకి ఆశించిన విజ‌యాన్ని అందించింది. తెలుగు-తమిళం-హిందీలో ఈ సినిమా ఘ‌న‌ విజ‌యాన్ని ద‌క్కించుకుంది.

కానీ ఈ స‌క్సెస్ కూడా స‌యీ మంజ్రేక‌ర్ కి ఏమాత్రం ప్ల‌స్ కాలేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని సరసన 'స్కంధ‌' సినిమాలో న‌టించింది. ఇది భారీ మాస్ యాక్ష‌న్ సినిమా. ఇందులో శ్రీ‌లీల ప్ర‌ధాన నాయిక కాగా.. స‌యీ ముఖ‌ర్జీ రెండవ కథానాయికగా నటిస్తోంది. క‌నీసం ఈ సినిమాతో అయినా స‌యీకి మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కితే, మాస్ హృద‌యాల్ని గెలుచుకునే క్రేజీ పెర్ఫామెన్సెస్‌తో ఆక‌ట్టుకుంటే త‌న‌కు టాలీవుడ్‌లో త‌దుప‌రి సినిమాల‌కు ఛాన్సుంటుంది.

'స్కంధ‌' బోయ‌పాటి మార్క్ మాస్ యాక్ష‌న్ సినిమా. రామ్ మాసిజం ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం కానుంది. అయితే శ్రీ‌లీల లాంటి ఎన‌ర్జిటిక్ డ్యాన్స‌ర్ ముందు తేలిపోకుండా ఉండాలంటే స‌యీ ముఖ‌ర్జీ చాలా హార్డ్ వ‌ర్క్ చేసి ఉండాలి. లేదంటే త‌న పాత్ర ప‌రిధి ప‌రిమితం అయిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

క్యూట్ గా క‌నిపిస్తూనే హాట్ గా అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం నిజానికి స‌యీ ముఖ‌ర్జీ ప్ర‌త్యేక‌త‌. అందానికి అందం అద్భుత‌మైన సొగ‌సు ఈ భామ సొంతం. కానీ అదృష్టం త‌న‌కు ఇన్నిరోజులు క‌లిసి రాలేదు. ఆ ల‌క్ స్కంధ‌తో క‌లిసి రావాల‌నే ఆకాంక్షిద్దాం.