Begin typing your search above and press return to search.

బులుగు ఫ్రాక్‌లో `మేజ‌ర్` బ్యూటీ ట్రీట్

ఇప్ప‌టివ‌ర‌కూ అడివి శేష్ మూవీ `మేజ‌ర్` త‌న‌ కెరీర్ బెస్ట్ అన‌డంలో సందేహం లేదు.

By:  Tupaki Desk   |   30 March 2024 5:41 PM GMT
బులుగు ఫ్రాక్‌లో `మేజ‌ర్` బ్యూటీ ట్రీట్
X

బులుగు జిలుగు థై స్లిట్ ఫ్రాక్‌లో గుబులు పుట్టిస్తోంది స‌యీ మంజ్రేక‌ర్. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. నేటిత‌రంలో స్పీడున్న భామ‌గా స‌యీ సోష‌ల్ మీడియా డిబేట్ల‌లోకి వ‌స్తోంది. `మేజ‌ర్` లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన స‌యీకి అంత‌కుముందు స‌రైన స‌క్సెస్ లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ అడివి శేష్ మూవీ `మేజ‌ర్` త‌న‌ కెరీర్ బెస్ట్ అన‌డంలో సందేహం లేదు.


అయితే ద‌బాంగ్ 3తో త‌న కెరీర్ ఎంత సులువుగా ప్రారంభ‌మైందో స‌యీ మంజ్రేక‌ర్ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకుంది. త‌న తండ్రి మహేశ్ మంజ్రేకర్ కారణంగా ప‌రిశ్ర‌మ‌లో త‌న ఆరంగేట్రం చాలా సులభంగా జ‌రిగింద‌ని స‌యీ అన్నారు. అంతేకాదు త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు సల్మాన్ ఖాన్‌ను తన `రక్షణ వలయం` అని పిలవగలిగినందుకు కృతజ్ఞత నిండి ఉందని తెలిపింది. 22 ఏళ్ల స‌యీ బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 (2019)తో అరంగేట్రం చేసింది. అప్పటి నుండి అతడిని తన గురువు మార్గదర్శిగా భావిస్తాన‌ని తెలిపింది. ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాత అయిన త‌న తండ్రి మ‌హేష్ మంజ్రేక‌ర్ నుంచి స‌ల‌హాలు తీసుకుంటాన‌ని కూడా తెలిపింది.


స‌ల్మాన్ లాంటి పెద్ద స్టార్ స‌ర‌స‌న ద‌బాంగ్ 3లో న‌టించ‌డం వ‌ల్ల మీకు అంత‌గా గుర్తింపు ద‌క్కే అవ‌కాశం లేదు క‌దా? అని ప్ర‌శ్నించ‌గా.. స‌యీ దానిని ఖండించింది. ఈ బ్యూటీ మాట్లాడుతూ, ``నా కోసం దబాంగ్ 3 చూడటానికి ఎవ్వరూ రాలేదు. నేను సల్మాన్ ఖాన్ సినిమాలో భాగం కావాల్సి వచ్చింది. కొత్తగా వచ్చిన న‌టికి ఇంతకంటే గొప్ప అవ‌కాశం ఇంకేదీ లేదు. అది నాకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టింది అనేది అప్ర‌స్తుతం. ఇంత పెద్ద అవ‌కాశం రావ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాలు వేచి చూడాలి క‌దా!`` అని అంది.

తాను త‌న గురువు స‌ల్మాన్ ఖాన్‌కి కాల్ చేసి, తను సంతకం చేసిన ప్రాజెక్ట్‌ల గురించి తెలియజేయాలని భావిస్తున్న‌ట్టు తెలిపింది. గురువుకి చెప్పకపోవడం అన్యాయమని నేను భావిస్తున్నాను. అతడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. నాకు పని లభిస్తే, ఎల్లప్పుడూ అతడికి కృతజ్ఞతతో ఉంటాను`` అని స‌యీ ముఖ‌ర్జీ అన్నారు. అలాగే త‌న తండ్రి మ‌హేష్‌ మంజ్రేకర్ తన వృత్తిపరమైన నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరని తెలిపింది. నాన్న ఒక దర్శకుడిగా నాకు ఉత్తమమైన సలహా ఇస్తాడు. కానీ నా సినిమా చూసిన తర్వాత చాలా నిర్మాణాత్మక విమర్శలు కూడా చేస్తార‌ని వెల్ల‌డించింది.