Begin typing your search above and press return to search.

డాడి తో డాట‌ర్... ఎలాంటి పాత్ర‌లంటే?

బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన స‌యి మంజ్రేక‌ర్ సుప‌రిచిత‌మే.

By:  Tupaki Desk   |   11 March 2024 1:30 PM GMT
డాడి తో డాట‌ర్... ఎలాంటి పాత్ర‌లంటే?
X

బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన స‌యి మంజ్రేక‌ర్ సుప‌రిచిత‌మే. తండ్రీ-కుమార్తెలిద్ద‌రు యాక్టింగ్ ప్రోఫెష‌న‌ల్ దూసుకుపోతున్నారు. డాడీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా..విల‌న్ గా బిజీగా ఉంటే? డాట‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌తో బిజీగా ఉంది. మ‌రి అలాంటి తండ్రి కుమార్తెలు క‌లిసి ప‌నిచేస్తే ఎలా ఉంటుంది? అభిమానులు అంత‌కుమించి కోరుకునేది ఏముంటుంది? అవును ఇలా క‌లిసి చేయాల‌ని స‌యిమంజ్రేక‌ర్ కూడా ఉంది.

ఇంత‌కాలం మ‌న‌సులోనే దాచేసుకున్న ఆ సంగ‌తిని తాజాగా రివీల్ చేసింది. అయితే ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేయ‌డం అన్న‌ది ఇక్క‌డ వేరు. ఆమె కేవ‌లం తండ్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాలో నటించాల‌ని ఉంది అని మాత్ర‌మే తెలిపింది. తండ్రితో తెర‌ను పంచుకునే అవ‌కాశం వ‌స్తే అది బోన‌స్ అవుతుంద‌ని తెలిపింది. కొన్ని రోజులుగా తండ్రి చెబుతోన్న క‌థ‌లు కూడా వింటుందిట‌.

అయితే ఆ క‌థ‌ల‌తో డాడ్ డాట‌ర్ ని మెప్పించ‌లేక‌పోతున్నాడ‌ని అంతే ఓపెన్ గా చెప్పింది. ఏ క‌థ న‌చ్చ‌డం లేద‌ని.. కొంచెం ఆల‌స్య‌మైన మంచి క‌థ‌...పాత్ర‌తోనే ప్రేక్షకుల ముందుకొస్తాం త‌ప్ప తొంద ర‌ప‌డి సినిమా చేయం అని తెలిపింది. అయితే ఆ కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డానికి మ‌రో ఏడాది స‌మ‌య‌మైనా ప‌ట్టొచ్చు అంటుంది. అన్ని అనుకున్న‌ట్లు కుదిరిగే త‌నుక 2025 లో ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపింది.

మ‌హేష్ మంజ్రేక‌ర్ మంచి న‌టుడే కాదు అంత‌కు మించి గొప్ప ద‌ర్శ‌కుడు కూడా. బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేసారు. 20 ఏళ్ల క్రిత‌మే ద‌ర్శ‌కుడిగా..న‌టుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టాడు. న‌టుడిగా కెమెరా ముందు ప‌నిచేస్తూనే ద‌ర్శ‌కుడిగా కెమెరా వెనుక యాక్ష‌న్ చెబుతున్నారు. ఇలా రెండు రంగాల్లోనూ బిజీగా కొన‌సాగ‌డం అన్న‌ది వీజీ కాదు.