Begin typing your search above and press return to search.

'స్కంధ‌' బ్యూటీ సంథింగ్ స్పెష‌ల్

ఇటీవ‌ల‌ స‌యీ మంజ్రేక‌ర్ ఇన్ స్టా వేదిక‌గా అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 11:30 AM GMT
స్కంధ‌ బ్యూటీ సంథింగ్ స్పెష‌ల్
X

టైట్ ఫిట్ .. థై స్లిట్ దుస్తుల్లో క‌నిపించ‌డం నేటి ఫ్యాష‌న్. అందాల క‌థానాయిక‌లు త‌మ‌ను తాము నిరంత‌రం లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఈ విధానాన్ని ఆశ్ర‌యిస్తున్నారు. కుర్ర‌కారు క‌ళ్ల‌ను త‌మ‌వైపు తిప్పేసుకునేందుకు ఇలాంటి గిమ్మిక్కుల‌ను అనుస‌రిస్తున్నారు. ముఖ్యంగా జిమ్ యోగా స‌మ‌యంలో టైట్ దుస్తుల‌ను ధ‌రించి క‌నిపిస్తున్నారు.

అసాధార‌ణ‌మైన ఈ ర్యాట్ రేస్ లో జాన్వీ క‌పూర్, సారా అలీఖాన్, అన‌న్య పాండే, కియారా అద్వాణీ, దిశా ప‌టానీ, మ‌లైకా అరోరా లాంటి టాప్ క్లాస్ బ్యూటీస్ ఉన్నారు. వీళ్ల‌కు ధీటుగా స‌యీ మంజ్రేక‌ర్ కూడా ఫేమ‌స్ అయింది. స‌ల్మాన్ భాయ్ ద‌బాంగ్ 3 తో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన స‌యీ మంజ్రేక‌ర్ ఆ త‌ర్వాత తెలుగు హీరో అడివి శేష్ స‌ర‌స‌న మేజ‌ర్ చిత్రంలో న‌టించింది. మేజ‌ర్ అన్ని భాష‌ల్లో విడుదలై మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత స‌యీ మంజ్రేక‌ర్ తెలుగులో ప‌లు చిత్రాల‌కు క‌మిటైంది. రామ్ స‌ర‌స‌న బోయ‌పాటి చిత్రం స్కంధ‌లో న‌టించినా ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. కానీ త‌న అంద‌చందాల‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

ఇటీవ‌ల‌ స‌యీ మంజ్రేక‌ర్ ఇన్ స్టా వేదిక‌గా అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా స‌యీ షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. ఇది టైట్ బాడీ హ‌గ్గింగ్ లెగిన్. నైక్ బ్రాండ్ స్పోర్ట్స్ వేర్. టైట్ టాప్ టైట్ లెగిన్ తో గుండెలు గుభేల్మ‌నించింది. జిమ్ కి వెళ్లి తిరిగి వ‌స్తూ ఇలా ప‌బ్లిక్ లో కంట ప‌డింది. స‌యీ అంద‌చందాల‌ను ఒక రేంజులో ఎలివేట్ చేస్తున్న ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.