Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : ఈ బ్యూటీని టాలీవుడ్‌ మిస్‌ అయ్యిందే

తాజాగా ఈమె ఇన్‌స్టాలో కవ్వించే ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. క్లీవేజ్ షో ఔట్‌ ఫిట్‌తో డిఫరెంట్‌ కలర్‌ ఎఫెక్ట్‌లో సాయి మంజ్రేకర్‌ మరింత అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Jun 2025 6:00 PM IST
పిక్‌టాక్ : ఈ బ్యూటీని టాలీవుడ్‌ మిస్‌ అయ్యిందే
X

టాలీవుడ్‌తో పోల్చితే బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్ హీరోయిన్స్‌గా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో కొందరు స్టార్‌ హీరోయిన్స్‌గా గుర్తింపు దక్కించుకోగా, కొందరు మాత్రం ఇంకా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు. చేసిన సినిమాలు హిట్‌ కాకపోవడంతో, ఆఫర్లు రాకపోవడంతో చాలా మంది స్టార్‌ కిడ్స్ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటే, కొందరు ఫ్యామిలీ లైఫ్‌ లో అడుగు పెడుతున్నారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు అయిన సాయి మంజ్రేకర్‌ పరిస్థితి ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉంది. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయింది. 2019లో దబాంగ్ సినిమాలో నటించడం ద్వారా బాలీవుడ్‌కి పరిచయం అయింది. అంతకు ముందు బాల నటిగా కూడా ఈ అమ్మడు నటించిన విషయం తెల్సిందే.


సాయి మంజ్రేకర్‌ తెలుగులో మొదటగా వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన గని సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ అదృష్టం కలిసి వచ్చి, సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ కలిసి వచ్చి తెలుగులో ఆ వెంటనే మేజర్ సినిమాలో నటించింది. అడవి శేష్‌ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ సక్సెస్‌ క్రెడిట్‌ మాత్రం ఈ అమ్మడికి దక్కలేదు. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా మేజర్‌ మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సాయి మంజ్రేకర్‌ కి వరుస ఆఫర్లు వస్తాయని అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆమె మరిన్ని ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.


తెలుగులో ఆ తర్వాత స్కంద సినిమాలోనూ నటించింది. కానీ ఆ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. చివరకు ఈ ఏడాదిలో కూడా ఈమె 'సన్నాఫ్ వైజయంతి' సినిమా తో వచ్చింది. కానీ ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. సినిమాలతో నిరాశ పరుస్తున్న సాయి మంజ్రేకర్‌ ఇన్‌స్టాలో రెండు మిలియన్‌ల కంటే ఎక్కువ ఫాలోవర్స్‌ను కలిగి ఉంది. రెగ్యులర్‌గా ఈమె అందాల ఆరబోత ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఇన్‌స్టాలో కవ్వించే ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. క్లీవేజ్ షో ఔట్‌ ఫిట్‌తో డిఫరెంట్‌ కలర్‌ ఎఫెక్ట్‌లో సాయి మంజ్రేకర్‌ మరింత అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


గోల్డెన్‌ కలర్‌తో సాయి మంజ్రేకర్‌ లుక్ అదిరింది అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఇంతటి అందగత్తెకు అదృష్టం కలిసి రాకపోవడంతో వరుస ఫ్లాప్స్ పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క హిట్‌ పడకున్నా తెలుగులో నాలుగు సినిమాలు చేసే అవకాశం దక్కడం మామూలు విషయం కాదు. ఈ అమ్మడికి ముందు ముందు కూడా ఆఫర్లు రావాలని, అప్పుడు అయినా హిట్‌ దక్కాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో చేసేంత అందంతో పాటు ప్రతిభ ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఆ ఆఫర్లు దక్కించుకోలేక పోవడం బాధాకర విషయం అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి ఇంతటి అందగత్తెను టాలీవుడ్‌ మిస్ అయిందని, ముందు ముందు అయినా ఈమె అందంకు తగ్గ ఆఫర్లు, సక్సెస్‌ రావాలని నెటిజన్స్‌ కోరుకుంటున్నారు.