చిట్టి పొట్టి నిక్కరుతో నటి రిమ్ జిమ్
నిజానికి ఫోటోలకు ఫోజులివ్వడం ఆ సమయంలో తనకు ఇష్టం లేనట్టుగా సయీ వ్యవహరిస్తున్నా కానీ, ఫోటోగ్రాఫర్లు తనను విడిచిపెట్టడం లేదు.
By: Tupaki Desk | 1 May 2025 10:30 PMజిమ్, యోగా సెషన్ల పేరుతో బాడీ హగ్గింగ్ దుస్తుల్లో కవ్వించడం, సమ్మర్ వేకేషన్ పేరుతో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ లో అందాలు ఆరబోయడం.. వీలున్న ప్రతి వేదికపైనా ఓపెన్ టాప్ దుస్తులతో మంటలు పెట్టడం.. మన భామలకు కొత్తేమీ కాదు. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఎవరికి వారు తమ ప్రత్యేకతను నిలుపుకునేందుకు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు.
ఇదే బాటలో ఇప్పుడు 'మేజర్' ఫేం సయీ మంజ్రేకర్ పొట్టి నిక్కరులో గుబులు రేపే రూపంతో కవ్విస్తోంది. జిమ్ నుంచి బయటకు వస్తూ, సయీ ఫోన్ మాట్లాడుతోంది. పరిసరాల్లోని తన కార్ వైపు వెళుతోంది. తన వెంటపడిన ఫోటోగ్రాఫర్లు సయీ ఫోటోగ్రాఫ్ ప్లీజ్..! అంటూ రెక్వస్ట్ చేస్తున్నారు. కానీ ఇదేమీ పట్టనట్టు సయీ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
నిజానికి ఫోటోలకు ఫోజులివ్వడం ఆ సమయంలో తనకు ఇష్టం లేనట్టుగా సయీ వ్యవహరిస్తున్నా కానీ, ఫోటోగ్రాఫర్లు తనను విడిచిపెట్టడం లేదు. మొత్తానికి సయీ పొట్టి నిక్కరులో కనిపించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. 'మేజర్' తర్వాత గని, అర్జున్ సన్నాఫ్ వైజయంతి వంటి చిత్రాల్లో నటించిన సయీ ముఖర్జీకి పరిస్థితులు కలిసి రావడం లేదు. టాలీవుడ్ లో దూసుకెళ్లే అవకాశం ఇంకా రాలేదు. ఒక పెద్ద స్టార్ సరసన సరైన హిట్టు పడే వరకూ తనకు ఇబ్బంది తప్పదు. అలాంటి ఒక మంచి అవకాశం కోసం సయీ వేచి చూస్తోంది.