Begin typing your search above and press return to search.

మెగా హీరో.. 100 కోట్ల హిట్టు తరువాత కొత్త దర్శకుడా?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు అందుకుంటున్న హీరోలలో మెగా హీరోలు కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   25 April 2024 11:30 AM GMT
మెగా హీరో.. 100 కోట్ల హిట్టు తరువాత కొత్త దర్శకుడా?
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు అందుకుంటున్న హీరోలలో మెగా హీరోలు కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. మెగా సపోర్ట్ ఎంత ఉన్నా కూడా మెల్లగా ఈ హీరోలు వారి కంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ అయితే క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్ అలాగే వారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనదైన శైలిలో వెళుతున్నాడు.

ఇక మరొక వారసుడు వరుణ్ తేజ్ కూడా డిఫరెంట్ ప్రయోగాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్నాడు. ఇక మెగా మేనల్లుళ్ళు సాయి, వైష్ణవ్ లు కూడా మొదట్లోనే మంచి సక్సెస్ లు అందుకున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, సాయి దుర్గ తేజ్ గా పేరు మార్చుకున్న తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ఈ కుర్రో హీరో ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత విరుపాక్ష సినిమాతో ఏకంగా 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేశాడు. ఆ సినిమా ఒక్కసారిగా మంచి బూస్ట్ ఇచ్చింది. అనంతరం మళ్లీ తన చిన్న మామయ్యతో బ్రో అనే మల్టీస్టారర్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇక అంత పెద్ద సినిమాలు చేసిన తర్వాత సాయి దుర్గ తేజ తప్పకుండా నెక్స్ట్ సినిమాను మరొక రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు అని అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఊహించిన విధంగా అతను నెక్స్ట్ ఒక కొత్త దర్శకుడితో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే సాయి మాస్ కమర్షియల్ డైరెక్టర్ సంపత్ నందితో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ సినిమా ఆగిపోయింది అనేలా కథనాలు వచ్చాయి.

ఆ విషయంపై మేకర్స్ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ మెగా మేనల్లుడు రోహిత్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా సాయిధరమ్ తేజ్ తో టచ్ లో ఉంటున్న ఈ యువ దర్శకుడు మొత్తంగా ఇటీవల ఒక మంచి కథతో మెప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టును హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి భారీ స్కేల్ లోనే నిర్మించబోతున్నట్లు సమాచారం. జూన్ నుండి రెగ్యులర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఆ సినిమాతో సాయిధరమ్ తేజ్ ఇలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.