Begin typing your search above and press return to search.

సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్.. ఎంతవరకు వచ్చిందంటే

కానీ లేటెస్ట్ ఇన్ సైడ్ సమాచారం ప్రకారం ఈ వారంలో ప్రాజెక్టు షూట్ మొదలు అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 12:30 PM GMT
సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్.. ఎంతవరకు వచ్చిందంటే
X

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మొత్తానికి విరుపాక్ష సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ బిగ్ స్క్రీన్ పై డిఫరెంట్ గా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన బ్రో మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం సినిమా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్రాఫిట్ అయితే అందించలేదు.

ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్నాడు. మళ్లీ సరికొత్తగా మరొక ప్రాజెక్టును మొదలుపెట్టడానికి త్వరలోనే సిద్ధం కాబోతున్నాడు. అయితే సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సంపత్ నంది దర్శకత్వంలో ఉండబోతుంది అని ముందుగానే క్లారిటీ వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ఈ వారంలోనే స్టార్ట్ కాబోతోంది అన్నట్టుగా చాలా రకాల కథనాలు అయితే వెలువడ్డాయి.

కానీ లేటెస్ట్ ఇన్ సైడ్ సమాచారం ప్రకారం ఈ వారంలో ప్రాజెక్టు షూట్ మొదలు అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇంకా దర్శకుడు షెడ్యూల్స్ కు సంబంధించిన ఎలాంటి ప్లాన్ కూడా సిద్ధం చేసుకోలేదు. ఎందుకంటే ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే లాక్ అయినప్పటికీ ఆమె బిజీగా ఉండడం వలన డేట్స్ కోసం కూడా ఒక స్పెషల్ ప్లాన్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది.

ఆమె డేట్ లను బట్టి సినిమా షూటింగ్ కు షెడ్యూల్స్ సెట్ చేయబోతున్నారు. ఇక ఆదివారం రోజు సాయంత్రం తేజ్ కు సంబంధించిన ఒక లుక్కు పై టెస్ట్ అయితే జరిగింది. ఇక ముందుగానే దర్శకుడు ఒక ప్రమోషనల్ వీడియోను షూట్ చేయబోతున్నాడు. ఇక దాన్ని సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజున అంటే అక్టోబర్ 15వ తేదీ విడుదల చేయబోతున్నారు.

దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. ఇక షూటింగ్ అయితే మూడు వారాల తర్వాత మొదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. మాస్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ లు కూడా సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది.