Begin typing your search above and press return to search.

సాయి ధరమ్ తేజ్.. అటు వైపు కూడా..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు

By:  Tupaki Desk   |   3 Jan 2024 3:51 AM GMT
సాయి ధరమ్ తేజ్.. అటు వైపు కూడా..
X

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత సినిమాలకి కొంత గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత ఫిజికల్ గా ఇంకా ఫిట్ కాకపోవడంతో పూర్తిగా రికవరీ అయ్యి మునుపటి స్పీడ్ అందుకోవాలని డిసైడ్ అయ్యి టైం తీసుకున్నాడు. అయితే ఈ ఏడాదిలో మరల సినిమాలు చేయడానికి ఫోకస్ చేస్తున్నాడు.

అదే సమయంలో మరో వైపు డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వాలని తేజ్ ప్లాన్ చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమాలతో సమానమైన ఆదరణ ఓటీటీ చానల్స్ లో వెబ్ సిరీస్ లకి ఉంది. ఇప్పటికే నార్త్ ఇండియాలో పెద్ద స్టార్స్ సైతం వెబ్ సిరీస్ లు చేయడం మొదలు పెట్టారు. తెలుగులో నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

చైతన్య దారిలోనే మరికొంత మంది హీరోలు కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. వీరిలో తేజ్ ముందు వరుసలో ఉన్నాడనే ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. ఓ కొత్త దర్శకుడుతో వెబ్ సిరీస్ కోసం చర్చలు జరుగుతున్నాయంట. ఎవరనేది క్లారిటీ లేదు కాని ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తోనే ఈ వెబ్ సిరీస్ చేయాలని తేజ్ భావిస్తున్నాడని టాక్.

అయితే మెగా హీరో విరూపాక్ష బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడని, ఇలాంటి సమయంలో వెబ్ సిరీస్ లు చేసే అవకాశం లేదని మరో ప్రచారం వినిపిస్తోంది. వెబ్ సిరీస్ లు చేయాల్సిన అవసరం తేజ్ కి లేదా మెగా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ జెనరేషన్ హీరోలు బిగ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ స్క్రీన్ పైన కూడా ఇంటరెస్టింగ్ కథలతో తమని తాము షోకేస్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

బిగ్ స్క్రీన్ పై కమర్షియల్ లైన్ దాటి హీరోలు రాలేదు. అదే డిజిటల్ స్క్రీన్ పైన ఎలాంటి ప్రయోగం చేసిన ఆడియన్స్ యాక్సప్ట్ చేస్తారు. కొత్తదనం ఉంటే ఆదరిస్తారు. ఆ ఇమేజ్ తరువాత బిగ్ స్క్రీన్ పైన రెగ్యులర్ కమర్షియల్ లైన్ నుంచి బయటకొచ్చి కొత్త కొత్త కథలతో సినిమాలు చేయడానికి స్కోప్ దొరుకుతుందని యంగ్ హీరోలు ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే వెబ్ సిరీస్ లపైన ఆసక్తి చూపిస్తున్నట్లు బోగట్టా.