బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వాట్ నాట్ టు డు?
కారణాలు ఏవైనా కానీ బేబి లాంటి బ్లాక్ బస్టర్ తీసి తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇంత డిలే చేయడం సరికాదేమో! అని కొందరు విశ్లేషిస్తున్నారు.
By: Tupaki Desk | 27 May 2025 8:00 AM ISTఈరోజుల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడికి అవకాశాలు రావడం చాలా సులువు. విజయమే పరమావధిగా భావించే పరిశ్రమలో బ్లాక్ బస్టర్ దర్శకులకు అవకాశాలిచ్చేందుకు, అడ్వాన్సులిచ్చేందుకు నిర్మాతలకు కొదవేమీ లేదు. కానీ బేబి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ట్యాలెంటెడ్ ఫిలింమేకర్ సాయి రాజేష్ మొదటి విజయం తర్వాత మరో సినిమా చేసేందుకు ఎందుకింత సమయం తీసుకున్నారు? అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
రకరకాల కారణాలతో బేబి తర్వాత ప్రీప్రొడక్షన్ లో ఉన్న సాయి రాజేష్ సినిమా ఆలస్యమవ్వడంపైనా ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ప్రధాన పాత్రలో బేబి హిందీ రీమేక్ ని పట్టాలెక్కించాలని అతడు ప్రయత్నించాడు. కానీ బాబిల్ ఇటీవలి వివాదం కారణంగా ఈ ప్రాజెక్టులో అవకాశం కోల్పోయాడని గుసగుస వినిపిస్తోంది. బాబిల్ తన సహనటులపై తీవ్రంగా ఆరోపిస్తూ చేసిన ఓ వీడియో, అతడి కెరీర్ కి ముప్పుగా మారింది. మరోవైపు గోవిందా నటవారసుడు యష్ వర్ధన్ అహూజా కోసం ప్రయత్నించినా అతడు వర్కవుట్ కాలేదని గుసగుస వినిపిస్తోంది. మరోవైపు వైష్ణవి లాంటి ప్రతిభావని కోసం చాలా ట్యాలెంటె హంట్ చేసినా ఎవరూ దొరకలేదట.
కారణాలు ఏవైనా కానీ బేబి లాంటి బ్లాక్ బస్టర్ తీసి తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇంత డిలే చేయడం సరికాదేమో! అని కొందరు విశ్లేషిస్తున్నారు. వేడి మీద ఉన్నప్పుడే ఆరగించాలి. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు తీయాలి. అప్పుడు దర్శకుడిగా అతడి స్థాయిని వేగంగా పెంచుకునేందుకు పని సులువు అవుతుంది. ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు చేసేందుకు అతడికి సొంత నిర్మాతలతో బ్యాకప్ బాగానే ఉంది కానీ, డిలే ప్రాసెస్ మాత్రం ఇబ్బందికరమేనని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడున్న దర్శకుల్లో టాప్ లీగ్ లో చేరే సామర్థ్యం ఉండీ టేకాఫ్ కాని ప్రాజెక్ట్ కోసం సమయం వృధా చేస్తున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు.
హృదయకాలేయం, కొబ్బరి మట్ట లాంటి వ్యంగ్యంతో కూడిన టైటిల్స్ ఎంచుకోవడంలోనే సాయి రాజేష్ ట్యాలెంట్ బయటపడింది. `బేబి`తో దర్శకుడిగా మోడ్రన్ డే బంపర్ హిట్టు కొట్టిన అతడు, నిర్మాతగా కలర్ ఫోటో లాంటి విమర్శకుల ప్రశంసలు, జాతీయ అవార్డ్ సాధించిన సినిమాని తీసాడు. అందుకే అతడి నుంచి బేబి తర్వాత వేగంగా సినిమాలు రావాలని పరిశ్రమతో పాటు, ప్రేక్షకాభిమానులు కోరుకున్నారు. సాయి రాజేష్ భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి.
