నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవికి ఛాన్స్ ఇచ్చిన హీరో!
సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి ఎలాంటి ఇమేజ్ సంపాదించుకుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 1 May 2026 2:20 PM ISTసౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవి ఎలాంటి ఇమేజ్ సంపాదించుకుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ చిత్రాల్లో సాయి పల్లవి అంటే ఓ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. తాను రిజెక్ట్ చేసిన సినిమాలున్నాయి గానీ తనని రిజెక్ట్ చేసిన కథలు లేవు. అంతటి బలమైన ముద్రను రెండు భాషల్లోనూ వేయగలిగిన నేటి తరం ఏకైక నటి పల్లవి. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయమవుతున్న `ఏక్ దిన్` సినిమాతో సాయి పల్లవి హిందీ వెండితెరకు పరిచయం అవుతుంది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న నేడే రిలీజ్ అయింది.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సాయి పల్లవి అభినయం చూసి చిత్రబృందం మంత్ర ముగ్ధులైంది. ప్రివ్యూ చూసిన తర్వాత అమీర్ ఖాన్ అయితే ఏకంగా అభిమానిగానే మారిపోయారు. సాయి పల్లవి నటనకు ఫిదా అవ్వడమే కాక, ఆమెపై ప్రశంసల వర్షం కురిపించడం బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాయి పల్లవిని ఏకంగా భారతీయ ఉత్తమ నటిగా ఆయన కీర్తించిన సంగతి తెలిసిందే. అమ్మడి నటనకు ఎంతో భావోద్వేగానికి సైతం గురయ్యారు. ఈనేపథ్యంలో అమీర్ ఖాన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్ లో ప్రచారం మొదలైంది.
సాయి పల్లవి ప్రతిభపై నమ్మకంతో అమీర్ ఖాన్ ఆమెకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారుట. అమీర్ ఖాన్ హీరోగా నటించే తదుపరి భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పాత్రను సాయి పల్లవికి ఆఫర్ చేసినట్లు సమాచారం. సాధారణంగా అమీర్ సినిమాల్లో పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఆయనే స్వయంగా ఒక నటిని ఎంచుకున్నారంటే ఆ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థం చెప్పొచ్చు. సాయి పల్లవి కూడా అమీర్ వంటి లెజెండ్ కల్పిస్తున్న అవకాశాన్ని వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో సాయి పల్లవి పేరు ఉత్తరాదిన మరోసారి మారు మ్రుగుతోంది.
ఇప్పటికే నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న `రామాయణ్` వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లో భాగమైన సంగతి తెలిసిందే. అందులో సాయి పల్లవి సీత పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ అయితే సాయి పల్లవి రేంజ్ బాలీవుడ్ లో అమాంతం మారిపోతుంది. ప్రస్తుం సాయి పల్లవి కూడా హిందీ సినిమాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. పాన్ ఇండియాలో నార్త్ మార్కెట్ నుంచి ఫేమస్ అయితే వచ్చే గుర్తింపు యూనిక్ గా ఉంటుందని భావిస్తోంది. రామాయణం విజయంతో అది సాధ్యమవుతుంది.
