సాయి ప్లలవికి ట్యాలెంటే సమస్యగా!
సాయి పల్లవిని కన్విన్స్ చేయడం అన్నది అంత సులభం కాదు. అన్ని పాత్రలకు ఆమె కనెక్ట్ కాదు. పాత్ర మనసుకు బాగా నచ్చితే తప్ప అంగీకరించదు.
By: Srikanth Kontham | 4 Feb 2026 9:00 PM ISTసాయి పల్లవిని కన్విన్స్ చేయడం అన్నది అంత సులభం కాదు. అన్ని పాత్రలకు ఆమె కనెక్ట్ కాదు. పాత్ర మనసుకు బాగా నచ్చితే తప్ప అంగీకరించదు. కానీ అందుకు దర్శకుడు తనలో తానే పెద్ద యుద్దాలే చేయాల్సి ఉంటుందని ఆ మధ్య ఓ యువ దర్శకుడు మాటల్ని బట్టి అర్దమైంది. సాయిపల్లవిని ఒప్పించడం కోసం తాను ఎన్ని రకాలుగా పని చేయాల్సి వచ్చిందన్నది పూస గుచ్చాడు. అప్పుడే సాయి పల్లవి పాత్రల విషయంలో ఎంత కఠినంగా ఉంటుంది? అన్నది అద్దం పట్టింది. కథకు..అందులో తాను పోషించే పాత్రకు చాలా సారూప్యత ఉండాలి.
కథలో పాత్ర సంపూర్ణంగా మింగిలై ఉండాలి. ఏమాత్రం డీవీయేట్ అయినా కన్విన్స్ అవ్వదు. నిర్మొహ మాటంగా నో చెప్పేస్తుంది. లేదా? పరి పూర్ణంగా సిద్దం చేసి తిరిగి రమ్మంటుంది. ఇవన్నీ చేయగల్గిన వారితో పనిచేస్తుంది. ఎందుకులే మరో నటిని తీసుకుందాం అనుకున్న వాళ్లు ఎగ్జిట్ అవుతారు. ఈ కారణంగా అమ్మడు కొన్ని అవకాశాలు కోల్పోతుంది అన్నది కాదనలేని నిజం. ఇంత వరకూ మీడియాలో హైలైట్ అయిన అంశం కూడా ఇదే. అయితే తాజాగా సాయిపల్లివిపై మరో కొత్త ఆరోపణ కూడా వినిపిస్తోంది. ఆమె లో ట్యాలెంట్ కూడా అవకాశాలు రాకుండా అడ్డు పడుతోంది? అన్నది మరో వెర్షన్.
ఇదేంటి ప్రతిభ ఉంటే ఎవరికైనా అవకాశాలు వస్తాయి? అదే ప్రతిభతో అవకాశాలు కోల్పోవడం ఏంటి అనుకుంటు న్నారా? ఇక్కడే ఉంది అసలైన రాజకీయం. హీరోల్ని డామినేట్ చేస్తోంది అన్న కారణంగా చాలా మంది డైరెక్టర్లు ఆమెను కావాలనే దూరం పెడుతున్నట్లు ఓ చర్చ జరుగుతోంది. ప్రముఖంగా టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడానికి ఇదే అసలైన కారణంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అంటే కొంత వరకూ వాస్తవం ఉంది. `లవ్ స్టోరీ` చిత్రంలో నాగచైతన్య కు జోడీగా నటించింది. అందులో చైతన్య పాత్రను డామినేట్ చేసింది.
సినిమాలో చైతన్య పాత్ర కంటే సాయి పల్లవి పాత్రకే మంచి క్రెడిట్ దక్కింది. అదనంగా సాయి పల్లవి మంచి డాన్సర్ కావడం కలిసొచ్చిన అంశం. తనలో ఈ స్కిల్ ని దర్శకుడు శేఖర్ కమ్ములా తెలివిగా సద్వినియోగం చేసుకున్నాడు. డాన్సులో తానో ప్రోఫెషనల్ అని నాగచైతన్య స్వయంగా ప్రశంసించాడు. ఆ సినిమాలో ప్రధానంగా హైలైట్ అయిన సన్నివేశాలు కూడా అవే. సాయి పల్లవి తొలి తెలుగు చిత్రం `ఫిదా` తోనే తానో ప్రోఫెషనల్ డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంది. `విరాట పర్వం` లాంటి చిత్రంలోనూ సాయి పల్లవి పెర్పార్మెన్స్ అంతే గొప్పగా ఉంటుంది.
రానా పాత్రని సైతం డామినేట్ చేసినట్లే ఉంటుంది. `అమరన్`, `గార్గీ`, `ఎన్జీకే`,` తండేల్` లాంటి చిత్రాల్లో అంతే బలమైన పాత్రలతో తనదైన ముద్ర వేసింది. ఈ సినిమాల తర్వాతే అమ్మడు తెలుగు, తమిళ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. రామాయణంలో సీత పాత్రకు ఏరికోరి మరీ నితీష్ తివారీ ఆమెను ఎంపిక చేసాడు? అంటే ఆమె ప్రతిభకు తార్కాణమది. అలాగే అమీర్ ఖాన్ మేనల్లుడి సరసన ఓ సినిమాకు అమీర్ స్వయంగా సాయి పల్లవిని ఎంపిక చేయడం ఇంట్రెస్టింగ్. నెటి జెనరేషన్ నటీమణుల్లో ఇలా ఓ దక్షిణాది నటిని బాలీవుడ్ ప్రత్యేకంగా ఎంపిక చేయడం అన్నది ఇదే తొలిసారి.
