టాలీవుడ్ కి దూరంగా సాయి పల్లవి..?
తెలుగులో సాయి పల్లవి నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎలాంటి కథ పడితే అలాంటి కథ సాయి పల్లవి చేయదు.
By: Tupaki Desk | 11 May 2025 11:30 AMకథల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాదు కాబట్టే సాయి పల్లవి సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదైనా ఉంది అంటే నిడివి గురించి ఆలోచించకుండా మిగతా విషయాలన్నీ లెక్క చేయకుండా చేసే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె సాయి పల్లవి మాత్రమే. ప్రేమం సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరికీ ఫేవరెట్ అయిన ఈ అమ్మడు తెలుగులో ఫిదాతో ఎంట్రీ ఇచ్చి స్టార్డం తెచ్చుకుంది. అప్పటి నుంచి రీసెంట్ గా వచ్చిన తండేల్ వరకు సాయి పల్లవి సినిమా అంటే ఇలానే ఉంటుంది అనేలా ప్రూవ్ చేస్తూ వచ్చింది.
తండేల్ కన్నా ముందు కూడా సాయి పల్లవి రెండేళ్లు టాలీవుడ్ కి దూరంగా ఉంది. తండేల్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో రామాయణ్ లో నటిస్తుంది. అది పూర్తయ్యే సరికి ఎలా లేదన్నా మరో ఏడాది పట్టేలా ఉంది. తెలుగులో సాయి పల్లవి నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎలాంటి కథ పడితే అలాంటి కథ సాయి పల్లవి చేయదు.
అందుకే మళ్లీ సాయి పల్లవి టాలీవుడ్ కి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్ లో కానీ అమ్మడు టాలెంట్ గుర్తించబడితే అక్కడ మేకర్స్ సాయి పల్లవితో వరుస సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. రామాయణ్ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుంది. ఆ పాత్రలో సాయి పల్లవి ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది.
బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక అప్పుడు మళ్లీ అమ్మడు సౌత్ సినిమాల మీద ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగులో సాయి పల్లవి సినిమా సైన్ చేసింది అంటే మాత్రం తప్పకుండా ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. మరి నెక్స్ట్ సాయి పల్లవి చేసే సినిమా ఏది అవుతుంది.. ఆ ప్రాజెక్ట్ ఎవరి డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమాలో హీరో ఎవరు అన్న డీటైల్స్ తెలియాల్సి ఉంది. టాలీవుడ్ మీద ప్రత్యేక అభిమానం ఉన్న సాయి పల్లవి ఇక్కడ సినిమా చేస్తే మాత్రం ఒక లెక్క ఉండాలని భావిస్తుంది. ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా తెలుగు ఆఫర్ అది కూడా నచ్చిన కథ వస్తే మాత్రం తప్పకుండా సాయి పల్లవి డేట్స్ అడ్జెస్ట్ చేసి మరీ ఆ ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.