Begin typing your search above and press return to search.

హైబ్రిడ్ పిల్ల‌తో అందుకే అంద‌రికీ ఇబ్బంది!

సాయి ప‌ల్ల‌విని సినిమాకు ఒప్పించాలంటే ఎంత క‌ష్ట‌మ‌వుతుంది? అన్న‌ది ఓ సంద‌ర్భంలో చందు మొండేటి ఎంతో ఓపెన్ గా చెప్పిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 April 2025 1:00 PM IST
హైబ్రిడ్ పిల్ల‌తో అందుకే అంద‌రికీ ఇబ్బంది!
X

సాయి ప‌ల్ల‌విని సినిమాకు ఒప్పించాలంటే ఎంత క‌ష్ట‌మ‌వుతుంది? అన్న‌ది ఓ సంద‌ర్భంలో చందు మొండేటి ఎంతో ఓపెన్ గా చెప్పిన సంగ‌తి తెలిసిందే. `తండేల్` లో సాయి పల్ల‌వి న‌టించంతో? ఆమెతో క‌లిగిన అనుభ‌వాన్ని చందు రివీల్ చేసాడు. ఆ స‌మ‌యంలో క‌థ‌, పాత్ర‌ల విష‌యంలో సాయిప‌ల్ల‌వి రెయిజ్ చేసే డౌట్లు మామూలుగా ఉండ‌వు..ఆమెతో ఎవ‌రు సినిమా తీయాల‌న్నా? ఒప్పించాల‌న్నా వాళ్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తాయ‌న్నారు.

సాయి ప‌ల్ల‌విని ఒప్పించ‌డం అంటే? ఏ డైరెక్ట‌ర్కి అయినా ఓ స‌వాల్ గానే ఉంటుంద‌ని త‌న అనుభ‌వాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. తాజాగా సాయి ప‌ల్ల‌వి క‌థ‌ల‌ను ఎలా ఎంచుకుంటుందో రివీల్ చేసింది. `ఎలాటి పాత్ర‌లోనైనా దాని లోతెంత అని చూస్తా. ఆ పాత్ర‌లో బ‌రువైన భావోద్వేగం ఉందా? లేదా? అన్న‌ది ఎక్కువ‌గా చూస్తా. దాని మీద నాలో నేనే విశ్లేష‌ణ చేసుకుంటా. న‌టిస్తే ఎలా ఉంటుంది అన్న‌ది మాత్రం సీరియ‌స్ గా ఆలోచ‌న చేస్తా.

విజ‌యం వ‌స్తుందా? లేదా? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ఆ పాత్ర ద్వారా ప్రేక్ష‌కుల్లో ఎంత వ‌ర‌కూ గుర్తింపు వ‌స్తుంద‌న్న‌ది చూసుకుంటా. ఎందుకంటే ప్రేక్ష‌కుల‌కు నిజాయితీగల క‌థ‌లు మాత్ర‌మే చెప్పాలి. ఏ పాత్ర పోషించినా అందులో భావోద్వేగానికి ప్రేకేక్ష‌కులు క‌నెక్ట్ అవ్వాలి. అలా క‌నెక్ట్ కాలేన‌ప్పుడు ఎంత గొప్ప పాత్ర పోషించినా అది వృద్ధా ప్ర‌య‌త్న‌మే అవుతుంది. అవార్డుల క‌న్నా ప్రేక్ష‌కుల ప్రేమ‌ను గెలుచు కోవ‌డం అన్న‌ది గొప్ప విష‌యం.

అవార్డుల గురించి ఎప్పుడు ఆలోచించ‌ను. ప్రేక్ష‌కుల మెప్పు త‌ర్వాత అవార్డులు వ‌స్తే దాన్ని బోన‌స్ గా మాత్ర‌మే భావిస్తాను. అలా అవార్డుల‌కు రెండో ప్రాధాన్య‌త ఇస్తాన‌ని` తెలిపింది. సాయిప‌ల్ల‌వి అందుకే త‌క్కువ సినిమాలు చేయ‌గ‌ల్గింది. న‌టిగా త‌న‌కంటూ కొన్ని ప‌రిమితులు విధించుకుని కొన‌సాగుతుంది. ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించ‌దు...గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది. కోట్లు ఇస్తామ‌న్నా నో ఛాన్స్ అంటూ రిజెక్ట్ చేస్తుంది. అది కేవ‌లం ఈ హైబ్రిడ్ పిల్ల‌కే సాద్య‌మైంది.