బుట్ట బొమ్మ ప్లేస్ లో సాయి పల్లవి..?
తెలుగులో ఎలాగు పెద్దగా ఛాన్స్ లు లేక కెరీర్ లో వెనకపడ్డ బుట్ట బొమ్మ పూజా హెగ్దే కోలీవుడ్ లో అయినా వరుస అవకాశాలు అందుకుంటుందని ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
By: Ramesh Boddu | 20 Nov 2025 9:56 AM ISTతెలుగులో ఎలాగు పెద్దగా ఛాన్స్ లు లేక కెరీర్ లో వెనకపడ్డ బుట్ట బొమ్మ పూజా హెగ్దే కోలీవుడ్ లో అయినా వరుస అవకాశాలు అందుకుంటుందని ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ దళపతి విజయ్ తో జన నాయగన్ సినిమా చేస్తున్న పూజా హెగ్దే లారెన్స్ చేస్తున్న కాంచనా 4లో కూడా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ఇదే కాకుండా లేటెస్ట్ గా ధనుష్ నెక్స్ట్ సినిమాకు కూడా హీరోయిన్ గా పూజా హెగ్దే పేరు పరిశీలించారని తెలుస్తుంది. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ముందు పూజా బేబ్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.
చివరి నిమిషంలో ఛాన్స్ మిస్..
ఐతే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఆమె ప్లేస్ లో సాయి పల్లవికి ఆ ఛాన్స్ ఇచ్చారట. పూజా హెగ్దే బ్యాడ్ లక్కేమో కానీ ఇలానే సినిమాకు దాదాపు కన్ఫర్మ్ హీరోయిన్ అని చెప్పి చివరి నిమిషంలో ఆ ఛాన్స్ మిస్ అయిపోతుంది. పూజా హెగ్దే చేతుల్లో నుంచి సాయి పల్లవికి ఆ ఛాన్స్ వరించిందని తెలుస్తుంది. సాయి పల్లవి ఆల్రెడీ ధనుష్ తో మారి 2 చేసింది. ఆ సినిమాలో రౌడీ బేబీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో నితీష్ తివారి డైరెక్షన్ లో చేస్తున్న రామాయణంలో నటిస్తుంది. సీత పాత్రలో సాయి పల్లవి తన అభినయంతో మెప్పించాలని చూస్తుంది. తెలుగు, తమిళ్ లో ఈమధ్య పెద్దగా సినిమాలు చేయట్లేదు సాయి పల్లవి. తెలుగులో తండేల్ తర్వాత కనీసం ఆమె ఏ సినిమా హీరోయిన్ డిస్కషన్ గా కూడా లేదు. ఐతే వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడం వల్ల బాలీవుడ్ రామాయణం కోసమే సాయి పల్లవి డేట్స్ అన్నీ ఇచ్చేసిందట.
అమరన్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్..
ఐతే ధనుష్ 55వ సినిమాకు మాత్రం సైన్ చేసిందని తెలుస్తుంది. అమరన్ తో రాజ్ కుమార్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ తెలుసు కాబట్టే ధనుష్ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పిందని తెలుస్తుంది. ముందు పూజా హెగ్దేని హీరోయిన్ గా అనుకున్నా సాయి పల్లవి అందుబాటులోకి రావడంతో ఆమెని పక్కన పెట్టారని తెలుస్తుంది. సో టాలీవుడ్ లోనే కాదు పూజా హెగ్దే బ్యాడ్ లక్ కోలీవుడ్ లో కూడా మొదలైందని ఆమె ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
సో ధనుష్ తో రాజ్ కుమార్ ఎలాంటి సినిమా చేస్తున్నాడని తెలియదు కానీ అందులో సాయి పల్లవి మాత్రం తన రోల్ లో అదరగొట్టేస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. సాయి పల్లవి కూడా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తండేల్ తర్వాత తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు అమ్మడు.
