Begin typing your search above and press return to search.

సీతమ్మ ఆశీర్వాదంతో సీతగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో!

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 July 2025 3:12 PM IST
సీతమ్మ ఆశీర్వాదంతో సీతగా సాయి పల్లవి.. ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో!
X

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సీతగా నటిస్తున్నారు. ఆమె ఆ రోల్ లో నటిస్తున్నట్లు రీసెంట్ గా గ్లింప్స్ తో మేకర్స్ మరోసారి అధికారికంగా స్పష్టత ఇచ్చారు. కానీ సాయి పల్లవి లుక్ ను మాత్రం రివీల్ చేయలేదు.


రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, రావణుడిగా ప్రముఖ నటుడు యష్ ను వేరే లెవెల్ లో చూపించారు. అయితే షూటింగ్ సెట్స్ నుంచి ఇప్పటికే కొన్ని పీక్స్ లీకయ్యాయి. అందులో సాయి పల్లవి.. చూడచక్కని బొమ్మగా కనిపించారు. కానీ అవి రియల్ పిక్స్ కావని కొందరు.. అసలైన ఫోటోలేనని మరి కొందరు అన్నారు.

మొత్తానికి నేచురల్ బ్యూటీ ఫస్ట్ లుక్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో రీసెంట్ గా సాయి పల్లవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ ను షేర్ చేశారు. సీత ఆశీర్వాదంతో, ఇతిహాసాన్ని పునః సృష్టించడానికి దైవం ఎంచుకున్న మార్గదర్శకులతో పాటు ప్రయాణాన్ని తాను కూడా అనుభవించగలనంటూ రాసుకొచ్చారు.

ప్రముఖ తారాగణం, సిబ్బందితో తాము సాధించడానికి కృషి చేస్తున్న అద్భుతాన్ని మీరందరూ అనుభవించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పిన సాయి పల్లవి.. రామ, సీత హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆల్ ది బెస్ట్ మేడమ్ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణ్ పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మండోదరిగా యాక్ట్ చేస్తున్నారు. సూర్పనకగా రకుల్ ప్రీత్ సింగ్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రామాయణకు వర్క్ చేస్తున్నారు.

ఇండియన్ మోస్ట్ ఫేమస్ ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ టాప్ హెన్స్ జిమ్మెర్.. మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం రెండో భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. తొలి భాగాన్ని 2026 దీపావళికి రిలీజ్ కానుండగా.. సెకండ్ పార్ట్ 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.