శేఖర్ కమ్ములపై సాయి పల్లవి ఇంట్రెసింగ్ పోస్ట్!
సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి 'కుబేర' సినిమాతో పాటు గురువు శేఖర్ కమ్ములపై ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేసింది.
By: Tupaki Desk | 20 Jun 2025 11:39 AM ISTధనుష్ హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా 'కుబేర'. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్‌ని పోషించింది. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి 'కుబేర' సినిమాతో పాటు గురువు శేఖర్ కమ్ములపై ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేసింది.
'కుబేర' ఎంతో ప్రత్యేకమైన సినిమా. దీనికి ఎన్నో కారణాలున్నాయి. సవాలుతో కూడుకున్న క్యారెక్టర్‌లని సెలెక్ట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు నాగార్జునను ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు నిజంగా ఓ కనువిందే. శేఖర్ తెరకెక్కించే సినిమాల్లో కథనాయికల పాత్రలు పవర్‌ఫుల్‌గా ఉంటాయనే విషయం సినీ ప్రేక్షకులకులందరికీ తెలుసు.
ఇందులో రష్మిక పోషించిన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్స్‌తో కొనసాగుతున్న ఆమెకు ఈ సినిమా మరో విజయాన్ని అందించనుంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్..మీ కెరీర్‌లోని బెస్ట్ ఆల్బమ్స్‌లలో ఇదీ ఒకటి కానుంది. ఈ సినిమా కోపం చమటోడ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నా. నిర్మాత సునీల్ నారంగ్ గారు నిర్మిస్తున్న సినిమాలు చూసి ఆయన తండ్రి నారాయణదాస్ నారంగ్ ఎంతో సంతోషిస్తారు. స్వస్ఛమైన మృదయం, అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి.
నాకెంతో ఇష్టమైన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఆయన ఎంతో మందిలో స్ఫూర్తిని నింపారు. అలా ప్రేరణ పొందిన వాళ్లలో నేనూ ఒకదాన్ని. నా గురువు ఎప్పుడూ సంతోషం,ఆయురారోగ్యాలతో జీవించాలని, ఇలాంటి అద్భుతమైన కథలు ఎన్నో మనకు అందించాలని నేడు ఈ టీమ్ అందరి ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నా` అంటూ తన గురువుపై అభిమానాన్ని చాటుకుంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన `ఫిదా` సినిమాతో సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయం కావడం తెలిసిందే.
