ఆ కథలో డెప్త్ ఉందా?
సాయి పల్లవి ఒక సినిమా చేసిందంటే ఆ సినిమాలోని పాత్రలో ఆమె లీనమైపోతుంది.
By: Tupaki Desk | 23 April 2025 12:00 AM ISTసాయి పల్లవి నటన గురించి, ఆమె టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సాయి పల్లవి హీరోయిన్ గా ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసింది. వాటిలో కొన్ని సినిమాలు హిట్లు గా నిలవగా, మరికొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. అయితే పల్లవి నటించిన సినిమాలు ఫ్లాపు అయ్యాయేమో కానీ నటిగా పల్లవి మాత్రం ఎప్పుడూ ఫ్లాపైంది లేదనేది అందరికీ తెలిసిన విషయమే.
సాయి పల్లవి ఒక సినిమా చేసిందంటే ఆ సినిమాలోని పాత్రలో ఆమె లీనమైపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు తెరపై సాయి పల్లవి కనిపించదు. ఆమె పోషిస్తున్న పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంతలా పల్లవి ఆ క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటుంది. ఆమె నటనకు ఫిదా అవని ప్రేక్షకులు ఉండరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సాయి పల్లవికి అవార్డులు కూడా క్యూ కడుతూ ఉంటాయి.
అయితే మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి అవార్డుల గురించి మాట్లాడుతూ, తనకు నేషనల్ అవార్డు గెలుచుకోవాలనే కోరిక ఉందని, దానికొక పర్సనల్ రీజన్ కూడా ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. తాను నేషనల్ అవార్డు గెలుచుకోవాలని కోరుకోవడం వెనుక కారణం తన అమ్మమ్మ తనకు ఇచ్చిన చీరేనని, తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన అమ్మమ్మ తనకు ఓ చీర ఇచ్చి దాన్ని పెళ్లికి కట్టుకోమని చెప్పిందని, కానీ తాను దాన్ని నేషనల్ అవార్డు అందుకున్నప్పుడు కట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలిపింది.
తన సహజమైన నటన, స్టార్‌డమ్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సాయి పల్లవి ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎంతో సింపుల్ గా కనిపిస్తుంది. ఎలాంటి మేకప్ లేకుండా సినిమాల్లో స్కిన్ షో చేయకుండా మిగిలిన హీరోయిన్లకు భిన్నంగా ఉండే సాయి పల్లవి తీరు అందరినీ ఎంతగానో మెప్పిస్తుంది. అందుకే ఆమెను తన అభిమానులు లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు.
రీసెంట్ గా నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా చేసిన సాయి పల్లవి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామాయణం సినిమాతో పల్లవి బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతుంది. సాయి పల్లవి ఎప్పుడూ తన ఫోకస్ మొత్తాన్ని సినిమాలోని తన పాత్రపైన, అందులోని ఎమోషన్స్ పైనే పెడుతుందనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమే స్వయంగా తెలిపింది.
ఒక పాత్రను సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఆ కథలో డెప్త్ ఉందా? స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయా అని తనను తాను ప్రశ్నించుకుంటానని, నిజాయితీ ఉన్న కథలను చెప్పడమే తన లక్ష్యమని, తాను చేసే క్యారెక్టర్లకు ఆడియన్స్ కనెక్ట్ అవడమే తన అసలైన సక్సెస్ అని, అవార్డుల కంటే ఆడియన్స్ ప్రేమను గెలుచుకోవడానికే తాను ప్రాధాన్యతనిస్తానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.
