సాయి పల్లవితో మైత్రీ మూవీ మేకర్స్ లేడీ ఓరియేంటెడ్!
రామాయణం తర్వాత ఆ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పాన్ ఇండియా ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసే ప్రయత్నాలు అప్పుడే మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి.
By: Tupaki Desk | 24 April 2025 8:00 AM ISTరామాయణం చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించడానికి రెడీ అవుతుంది. బాలీవుడ్ లో ఆరంభ చిత్రమే గొప్ప సినిమా కావడంతో? భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ఒక్క సినిమాతోనే సాయి పల్లవి పాన్ ఇండియాలో సంచలన మవుతుం దనే అంచనాలు ఏర్పడుతున్నాయి. తెలుగు, తమిళ్ , మలయాళంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
రామాయణం తర్వాత ఆ ఇమేజ్ రెట్టింపు అవుతుంది. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పాన్ ఇండియా ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసే ప్రయత్నాలు అప్పుడే మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి. సాయి పల్లవి ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, హిందీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఆలోచనలో సదరు సంస్థ ఉన్నట్లు తెలిసింది.
ఓ సీనియర్ రచయిత అందించిన స్టోరీ లాక్ చేసినట్లు తెలిసింది. కానీ దర్శకుడి వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. సాయి పల్లవి ఇప్పటికే గార్గీ చిత్రంతో లేడీ ఓరియేంటెడ్ వరల్డ్ లో కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ ఉమెన్ సెంట్రిక్ చిత్రాల అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్లోనే సాయి పల్లవి సెకెండ్ లేడీ ఓరియేంటెడ్ చిత్రమవుతుంది.
ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం షూటింగ్ లోబిజీగా ఉంది. మొదటి భాగం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. మే నుంచి రెండవ భాగం షూటింగ్ మొదలవుతుంది. రెండవ భాగం లో సాయి పల్లవి చాలా కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. సీతమ్మ వనవాసానికి సంబంధించిన సన్నివేశాలు రెండవ భాగంలోనే షూట్ చేస్తున్నారు. ఏడాదంతా రెండవ భాగం షూటింగ్ ఉంటుంది. అనంతరం వచ్చే ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ సినిమా ఉండే అవకాశం ఉంది.
