Begin typing your search above and press return to search.

MS సుబ్బలక్ష్మి బయోపిక్‌లో ఎవరు హీరోయిన్? క్లారిటీ ఇదే..

భారతీయ సంగీత శిఖరం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత కథ వెండితెరపైకి వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

By:  Madhu Reddy   |   26 April 2026 5:00 PM IST
MS సుబ్బలక్ష్మి బయోపిక్‌లో ఎవరు హీరోయిన్? క్లారిటీ ఇదే..
X

భారతీయ సంగీత శిఖరం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత కథ వెండితెరపైకి వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈ బయోపిక్‌లో హీరోయిన్ మారిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి స్థానంలో మరో కన్నడ భామ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ప్రాజెక్టులో నటిస్తున్నది ఎవరు? మేకర్స్ ఇచ్చిన తాజా క్లారిటీ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సాయి పల్లవి అవుట్.. రుక్మిణి ఇన్?:

కర్ణాటక సంగీత మహా రాణి ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారి బయోపిక్‌ను 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషిస్తుందని ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ఈ ప్రాజెక్టులోకి వచ్చిందని, సాయి పల్లవి తప్పుకుందని కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. ఇక దీనిపై ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే నడిచింది. రుక్మిణి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉండటంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది.

రూమర్లకు చెక్ పెట్టిన మేకర్స్:

ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవడానికి మూవీ టీమ్ ను సంప్రదించగా, వాళ్లు ఈ వార్తలను పూర్తిగా ఖండించారు. హీరోయిన్ మారిందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, సాయి పల్లవి మాత్రమే ఈ పాత్రను పోషిస్తారని స్పష్టం చేశారు. కేవలం సాయి పల్లవి డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే సినిమా పట్టాలెక్కడం ఆలస్యమవుతోందని క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది.

షూటింగ్ ఎందుకు ఆలస్యమవుతోంది?:

సాయి పల్లవి ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. హిందీలో ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రంలో సీతగా నటిస్తుండటంతో పాటు, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రాజెక్టులో కూడా బిజీగా ఉన్నారు. ఈ భారీ సినిమాల వల్ల ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్‌కు టైం కేటాయించడం కుదరడం లేదు. అందుకే మేకర్స్ కూడా ఆమె కోసం వేచి చూస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ నిరంతరాయంగా మొదలయ్యే అవకాశం ఉందని టీమ్ తెలిపినట్టు టాక్.

బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ క్లాసికల్ బయోపిక్‌కు రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సుబ్బలక్ష్మి గారి సంగీత ప్రస్థానాన్ని, ఆమె సాధించిన విజయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నారు. ఇక ఇప్పటికే సాయి పల్లవి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి మార్క్ మేకింగ్‌తో రూపొందనున్న ఈ సినిమా, భారతీయ సినిమా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అనవసరమైన రూమర్లను నమ్మవద్దని, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవిని చూడటం ఖాయమని మేకర్స్ తేల్చి చెప్పారు. సాయి పల్లవి నటనకు, సుబ్బలక్ష్మి గారి వ్యక్తిత్వానికి చక్కటి పొంతన కుదురుతుందని అందరూ నమ్ముతున్నారు. మరి అక్టోబర్‌లో మొదలుకానున్న ఈ మ్యూజికల్ జర్నీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.