ఆ బయోపిక్ లో సాయి పల్లవి తప్ప మరో ఆప్షనే లేదట!
భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన కోకిల ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై ఇండస్ట్రీలో మళ్లీ చర్చలు వేడెక్కుతున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 27 April 2026 3:05 PM ISTభారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాన కోకిల ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై ఇండస్ట్రీలో మళ్లీ చర్చలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు వస్తున్న సమాచారం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మధ్యలో పలు పేర్లు వినిపించినప్పటికీ, మేకర్స్ మాత్రం సాయి పల్లవిని తప్ప మరెవరినీ ఈ పాత్ర కోసం పరిగణనలోకి తీసుకోవడంలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం.
ఇటీవల ఈ బయోపిక్ నుంచి సాయి పల్లవి తప్పుకుందనే వార్తలు, అలాగే ఆమె స్థానంలో రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తలన్నింటినీ మేకర్స్ పూర్తిగా ఖండించినట్టు తెలుస్తోంది. ఎం.ఎస్ సుబ్బులక్ష్మి లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తెరపై ప్రతిబింబించాలంటే సాయి పల్లవి లాంటి నటి అవసరమని టీమ్ గట్టిగా నమ్ముతోందట. ఆమె నటనలో ఉన్న సహజత్వం, క్లాసికల్ లుక్, డెడికేషన్ లాంటి క్వాలిటీస్ ఆమెను ప్రత్యేకంగా నిలబెడతాయని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో ఆమెనే కొనసాగిస్తున్నామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొదట ఈ సినిమా త్వరగా స్టార్ట్ అవుతుందని భావించినప్పటికీ, సాయి పల్లవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో, ఈ పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటోందన్న సమాచారం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొదట ఈ సినిమా త్వరగా స్టార్ట్ అవుతుందని భావించినప్పటికీ, సాయి పల్లవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ప్రత్యేకంగా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటోందన్న సమాచారం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించనుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో బలంగా మారింది. జెర్సీ వంటి భావోద్వేగభరితమైన సినిమాతో తన కథన శైలిని నిరూపించుకున్న ఆయన, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి జీవితాన్ని కూడా అదే స్థాయిలో ఎమోషనల్ గా, నిజాయితీగా చూపిస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనుండటం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఒక గొప్ప సంగీత విద్వాంసురాలి జీవితం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించనుంది. మొత్తానికి, సాయి పల్లవి లాంటి ప్రతిభావంతమైన నటి ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించడం, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ సంగీతం ఇవన్నీ కలిసివచ్చి ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ఆసక్తికరంగా మార్చుతున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, త్వరలోనే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
