Begin typing your search above and press return to search.

సాయి పల్లవి.. జస్ట్ ఒక అడుగు దూరంలో..

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 Oct 2025 6:00 PM IST
సాయి పల్లవి.. జస్ట్ ఒక అడుగు దూరంలో..
X

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ఆమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్న అమ్మడు.. తన నేచురల్ లుక్, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తనకంటూ ఇప్పటికే ప్రత్యేక ఇమేజ్ ను సృష్టించుకున్నారు.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న సాయి పల్లవి.. ఇప్పుడు సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్ అనే చెప్పాలి. రీసెంట్ గా తండేల్ మూవీతో భారీ హిట్ ను అందుకున్న బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్ లో నటిస్తున్నారు.

సినిమాలో సీతమ్మగా కనిపించనున్న ఆమె లుక్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఆ మూవీతో మరిన్ని చిత్రాలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు రామాయణ్ సినిమాకు గాను సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. రూ.20 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.

అంతే కాదు.. తాను నటించబోయే తర్వాత ప్రాజెక్టులకు దాదాపు రూ.13 కోట్ల వరకు అందుకోనున్నారని సమాచారం. అయితే ఇప్పుడు అత్యధిక పారితోషికం అందుకునే సౌత్ హీరోయిన్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. మరో స్టార్ హీరోయిన్ నయనతార భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ టాప్ లో ఉంది.

ఆమె ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు పైగా అందుకుంటున్నారని సమాచారం. దీంతో ఆమె హైయెస్ట్ పారితోషికం అందుకున్న సౌత్ బ్యూటీల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండగా, సాయి పల్లవి రెండో స్థానంలో ఉంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియా ఆ వివరాలను ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే సాయి పల్లవికి ఇప్పటికే మంచి క్రేజ్ ఉండగా.. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు రామాయణ్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే.. సాయి పల్లవి క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. అలా సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు టాప్ ప్లేస్ కు జస్ట్ అడుగు దూరంలో ఉన్నారు సాయి పల్లవి.