సాయి పల్లవి ఒట్టు పెట్టుకుందా?
దీంతో నెటి జనులు సోషల్ మీడియాలో కామెంట్లు షురూ చేసారు. 'రామాయణం' పూర్తిచేసే వరకూ తెలుగు సినిమా చేయకూడదని ఒట్టు పెట్టుకుందా?
By: Tupaki Desk | 29 May 2025 5:00 AM ISTసాయి పల్లవి ఫోకస్ అంతా రామాయణంపైనే పెట్టిందా? ఆ సినిమా పూర్తి చేసే వరకూ మరో తెలుగు సినిమా కమిట్ అవ్వదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఈ ఏడాది అమ్మడు 'తండేల్' సినిమాతో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే 'రామాయణం' సెట్స్ లో ఉంది. 'తండేల్' అన్నది ఎప్పుడో ఇచ్చిన కమిట్ మెంట్ కావడంతో? ఎలాగూ ఆ చిత్రాన్ని పూర్తి చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ కొత్త సినిమాకి మాత్రం కమిట్ అవ్వలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో చేస్తోన్న 'రామాయణం' షూటింగ్ లోనే బిజీగా ఉంది. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ పూర్తయింది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఏకధాటిగా రామాయణం రెండవ భాగం కూడా చిత్రీకరణ జరుగుతోంది. మొదటి భాగాన్ని 2026 లో రెండవ భాగాన్ని 2027లో రిలీజ్ చేసే ప్రణాళికతో వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండవ భాగం షూటింగ్ కి గ్యాప్ తీసుకోకుండా పని చేస్తున్నారు.
వాళ్లతో పాటు సాయి పల్లవి కూడా అంతే కమిట్ మెంట్ తో పనిచేస్తోంది. దీంతో పాటు 'ఏక్ దిన్' అనే మరో హిందీ సినిమా కూడా చేస్తోంది. కానీ తెలుగు సినిమాకు మాత్రం కమిట్ అవ్వలేదు. 'తండేల్' తర్వాత అమ్మడు పూర్తిగా ముంబైకే పరిమితమైంది. హైదరాబాద్ రావడమే మానేసింది. ముంబై టూ చెన్నై తిరు గుతుంది తప్ప మధ్యలో హైదరాబాద్ ను మాత్రం టచ్ చేయలేదు.
దీంతో నెటి జనులు సోషల్ మీడియాలో కామెంట్లు షురూ చేసారు. 'రామాయణం' పూర్తిచేసే వరకూ తెలుగు సినిమా చేయకూడదని ఒట్టు పెట్టుకుందా? అంటూ ఓ నెటి జనుడు పోస్ట్ చేసాడు. అయినా సాయి పల్లవి ని సినిమాకు ఒప్పించడం అన్నంది అంత సులభం కాదు. ఆమెని తమ కథలతో ఒప్పించాలంటే తల ప్రాణం తోక వరకు వస్తుందని చందు మొండేటి తండేల్ అనుభవాల్లో భాగంగా పంచుకున్న సంగతి తెలిసిందే. కొత్త సినిమా కమిట్ మెంట్ ఆలస్యానికి అసలైన కారణం ఇదే కావొచ్చు.
