Begin typing your search above and press return to search.

సాయి పల్లవి క్రేజ్ ని క్యాష్ చేసుకుంటారా..?

సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తుంది. సినిమాలో ఆమె సీత పాత్రలో నటిస్తుంది. నితేష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ్ సినిమాలో రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   28 April 2025 2:45 AM
సాయి పల్లవి క్రేజ్ ని క్యాష్ చేసుకుంటారా..?
X

తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ యువతకు ఫేవరెట్ గా మారిన భామ సాయి పల్లవి. ఆమె ఒక సినిమాలో ఉంది అంటే చాలు అది పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకుంది. సాయి పల్లవి కూడా ఆడియన్స్ లో తనకున్న ఈ ఫాలోయింగ్ ని గుర్తించి ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయడానికి నిరాకరిస్తుంది. తెలుగు, తమిళ్ తో పాటు మిగతా సౌత్ భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది.

సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ్ లో నటిస్తుంది. సినిమాలో ఆమె సీత పాత్రలో నటిస్తుంది. నితేష్ తివారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణ్ సినిమాలో రణ్ బీర్ కపూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. రాముడిగా రణ్ బీర్, సీతగా సాయి పల్లవి ఈ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో రావణాసురుడిగా కె.జి.ఎఫ్ యష్ నటిస్తున్నాడు.

రామాయణ కథతో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. నితేష్ రామాయణ్ లో ఎలా ఉంటుంది అన్న ఎగ్జైట్ మెంట్ ఉంది. ఐతే ఈ సినిమాలో సీతగా చేస్తున్న సాయి పల్లవికి సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ రామాయణ్ సినిమాను సౌత్ లో ఎక్కువ ప్రమోట్ చేసేలా చూస్తున్నారు. త్వరలో రామాయణ్ సినిమా నుంచి సాయి పల్లవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

రామాయణ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటీ ఫీషియల్ పోస్టర్ వదలలేదు. సీత పాత్రలో సాయి పల్లవి ఫస్ట్ లుక్ తో ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న రామాయణ్ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మన సౌత్ సినిమాలు బాలీవుడ్ లో కలెక్ట్ చేసినంతగా అక్కడి సినిమాలు సౌత్ లో కలెక్ట్ చేయవు. కానీ ఈసారి సౌత్ స్టార్స్ తో చేస్తున్న రామాయణ్ సినిమాను సౌత్ లో కూడా అదరగొట్టేలా చేయాలని చూస్తున్నారు. సో సాయి పల్లవి క్రేజ్ కూడా అందుకు బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. యష్, సాయి పల్లవి, రకుల్ ఇలా సౌత్ ఆడియన్స్ కి తెలిసిన నటులే కావడంతో రామాయణ్ కేవలం హిందీ సినిమాలా కాకుండా పాన్ ఇండియా ఇంపాక్ట్ ఉండేలా చూస్తున్నారు.