Begin typing your search above and press return to search.

సాయి పల్లవిపై ట్రోల్స్.. ఇది చాలా తప్పు!

సీతమ్మ అంటే ఇలా ఉండాలని కామెంట్స్ పెట్టారు. మేకప్ కు చాలా దూరంగా ఉండే సాయి పల్లవిని సీతగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎంతో వెయిట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 July 2025 6:43 PM IST
సాయి పల్లవిపై ట్రోల్స్.. ఇది చాలా తప్పు!
X

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలియని వారుండరని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించిన బ్యూటీని లేడీ పవర్ స్టార్ అని అంతా ముద్దుగా పిలుస్తుంటారు. సాయి పల్లవి అంటే ఒక బ్రాండ్ అని అనిపించుకుంది అమ్మడు.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసిన అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. వివిధ సినిమాలకు ఓకే చెబుతోంది.

రీసెంట్ గా తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సాయి పల్లవి.. ఇప్పుడు రామాయణ్ లో యాక్ట్ చేస్తోంది. సీతమ్మగా కనిపించనుండగా.. ఆమె ఫస్ట్ లుక్ కోసం అభిమానులు, సినీ ప్రియులు, ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పిక్స్ లీక్ అవ్వగా.. అందులో సాయి పల్లవిని చూసి అంతా ఫిదా అయ్యారు

సీతమ్మ అంటే ఇలా ఉండాలని కామెంట్స్ పెట్టారు. మేకప్ కు చాలా దూరంగా ఉండే సాయి పల్లవిని సీతగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎంతో వెయిట్ చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రామాయణ్ లోని సీత రోల్ కు ఆమె సరైన నటి కాదని ఆరోపిస్తున్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

దీంతో సాయి పల్లవికి అనేక మంది నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె యాక్టింగ్ అండ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అంటున్నారు. సహజమైన అందం ఆమె సొంతమని, శస్త్రచికిత్స ద్వారా తన ముఖాన్ని మెరుగుపరుచుకోని అరుదైన నటీమణుల్లో ఆమె కూడా ఒకరని అంటున్నారు.

సీతకు ఆమె పెర్ఫెక్ట్ నటి అని చెబుతున్నారు. అటు టాలెంట్.. ఇటు సహజ అందం రెండూ సమపాళ్లలో ఉన్నాయని అంటున్నారు. క్యాస్టింగ్ లో మిగతా వారిని ప్రశంసించినా.. ఏం చేసినా పర్లేదని.. కానీ సాయి పల్లవిని ట్రోల్ చేయడం చాలా తప్పు అని చెబుతున్నారు. కొందరు కావాలని చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై నేచురల్ బ్యూటీ రెస్పాండ్ అవుతుందేమో వేచి చూడాలి.