సహజసిద్ధమైన సీతా దేవి రూపం
తాజా ఫోటోగ్రాఫ్స్ లో సాయిపల్లవి ప్రకృతిని ఆస్వాధిస్తూ కనిపిస్తోంది. పిల్లలతో ఆటలడుతూ రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. టెడ్డీ బేర్ తో ఆడుతూ.. కిడ్స్ తో ఆటలాడుతూ కనిపించింది.
By: Tupaki Desk | 23 July 2025 10:05 PM IST`రామాయణం` లాంటి క్రేజీ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది సాయిపల్లవి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో, సాయిపల్లవి సీతాదేవిగా నటిస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇండియాలో నెవ్వర్ బిఫోర్ విజువల్స్ తో రక్తి కట్టించనుంది. రెండు భాగాల ఫ్రాంఛైజీ సినిమా కోసం ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే సీత పాత్ర కోసం సాయిపల్లవి ఎంపిక సరైనదా కాదా? అనే డిబేట్ సోషల్ మీడియాల్లో నడుస్తోంది. అయితే సాయిపల్లవి అభిమానులు మాత్రం `అత్యుత్తమ ఎంపిక` అని కితాబిచ్చేస్తున్నారు. మరోవైపు సాయిపల్లవి తన పాత్రకు తగ్గట్టే ఎంతో సహజసిద్ధమైన రూపలావణ్యంతో తెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. కేవలం పెద్ద తెర కోసమే కాదు.. వ్యక్తిగతంగా కూడా సాయిపల్లవి సహజసిద్ధమైన అందంతో కనిపిస్తుంది. ఈ బ్యూటీ తాజాగా వెబ్ లో షేర్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే దీనిని ఎవరైనా అంగీరిస్తారు. సీత పాత్రకు సహజసిద్ధమైన రూపలావణ్యం చాలా అవసరం. అధునాతన అమ్మాయిలా అస్సలు కనిపించకూడదు. ఆ రకంగా నితీష్ జీ ఎంపిక సరైనది.
తాజా ఫోటోగ్రాఫ్స్ లో సాయిపల్లవి ప్రకృతిని ఆస్వాధిస్తూ కనిపిస్తోంది. పిల్లలతో ఆటలడుతూ రిలాక్స్ డ్ గా కనిపిస్తోంది. టెడ్డీ బేర్ తో ఆడుతూ.. కిడ్స్ తో ఆటలాడుతూ కనిపించింది. సాయిపల్లవి మేకప్ లెస్ రూపం సహజసిద్ధమైన గిరజాల జుత్తు, విశాలమైన కళ్లు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ సీతా దేవి లక్షణాలు. నాగ చైతన్యతో `తండేల్` చిత్రంలో సాయిపల్లవి నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూలు చేసింది.
