12 ఏళ్ల తర్వాత క్రేజీ రీ-యూనియన్!
ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే చరణ్- సాయి కుమార్ కలిసి నటించడం ఇది రెండోసారి.
By: Srikanth Kontham | 13 April 2026 5:38 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈనెల 30న రిలీజ్ అవుతుందా? జూన్ లో రిలీజ్ అవుతుందా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్ర పోషి స్తున్నట్లు సమాచారం. ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే చరణ్- సాయి కుమార్ కలిసి నటించడం ఇది రెండోసారి.
రామ్ చరణ్, సాయి కుమార్ కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చే సినిమా `ఎవడు`. 2013లో విడుదలైన ఆ చిత్రంలో సాయి కుమార్ చరణ్ తండ్రిగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో సాయకుమార్ డైలాగులతో మరో సారి హైలైట్ అయ్యారు. చరణ్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ సాయకుమార్ చెప్పే డైలాగులు థియేటర్లో పూనకాలు తెప్పించాయి. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి పనిచేయలేదు. ఈనేపథ్యంలో 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇద్దరు నటులు మళ్ళీ ఒకే తెరపై కనిపించబోతున్నారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ మళ్ళీ పట్టాలెక్కుతుండటంతో `పెద్ది` చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. వీరిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
బుచ్చిబాబు సానా ఈ కథను ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. `పెద్ది`లో రామ్ చరణ్ ఒక విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు. సాయి కుమార్ పాత్ర కూడా అంతే గంభీరంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి కుమార్ తనదైన శైలి డైలాగ్ డెలివరీ , నటనతో ఈ చిత్రానికి కొత్త బలాన్ని ఇస్తారని ప్రేక్షకులు నమ్ముతు న్నారు. సాయి కుమార్ పాత్ర కథను మలుపు తిప్పే కీలకమైన మలుపులో ఉంటుందని సమాచారం.ఈ చిత్రం నటీనటుల కలయిక పరంగానే కాకుండా? సాంకేతికంగా కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉండబోతోంది.
సాయి కుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. కేవలం తండ్రి పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనలోని నటుడిని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్‌తో పని చేయడం, అది కూడా బుచ్చిబాబు వంటి విజనరీ డైరెక్టర్ పర్యవేక్షణలో నటించడం తన కెరీర్‌లో మరో మంచి మలుపు అవుతుందని ఆశిస్తున్నారు. అభిమానులు కూడా ఇద్దరి కాంబోలో రాబోయే ఆ పవర్‌ఫుల్ సీన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి కుమార్ - రామ్ చరణ్ ల రీ-యూనియన్ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం `పెద్ది` చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
