Begin typing your search above and press return to search.

సాయి దుర్గా తేజ్ మరో ప్రయోగం.. పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా..

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఈమధ్య కాలంలో నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త తరహా కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   3 April 2026 1:17 PM IST
సాయి దుర్గా తేజ్ మరో ప్రయోగం.. పోస్టర్ తోనే కిక్కిచ్చారుగా..
X

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఈమధ్య కాలంలో నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త తరహా కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత చేస్తున్న ప్రతి సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తన 19వ చిత్రాన్ని ప్రకటించారు. పాతకాలపు రహస్యాలు, ఊహకు అందని శక్తుల చుట్టూ తిరిగే ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, సాయి తేజ్ ఈసారి ఒక భారీ విజువల్ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.




ఇప్పటికే ‘క’ చిత్రంతో తమ ప్రతిభను చాటుకున్న సుజిత్, సందీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలో వారు చూపించిన టెక్నికల్ వాల్యూస్ అందరినీ మెప్పించాయి. ఇప్పుడు సాయి తేజ్ తో కలిసి మైథిక్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో అంతకు మించిన స్థాయిలో ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కలయిక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థ, ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తోంది. పోస్టర్‌లో ఒక యోధుడు భారీ గ్రహశకలం ముందు నిలబడి ఉండటం చూస్తుంటే, కథాంశం చాలా లోతుగా ఉంటుందనిపిస్తోంది. ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు ఒక గ్రేట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

హై కాన్సెప్ట్ సినిమాలు తీయడం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ట్రెండ్ గా మారింది. సాయి తేజ్ కూడా పాత ఫార్ములా కథలకు స్వస్తి చెప్పి, ఇలాంటి కొత్త జోనర్ల వైపు వెళ్లడం మంచి పరిణామం. సుజిత్ సందీప్ ద్వయం తమ విజువల్ సెన్స్‌తో ఈ సినిమాను గ్లోబల్ స్టాండర్డ్స్ లో తీర్చిదిద్దే పనిలో పడ్డారు. పురాణాలకు సైన్స్ ఫిక్షన్‌ను జోడించి చెప్పే కథలు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అందుకే ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీ వర్గాల్లో పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.

నటీనటుల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయి తేజ్ తన పాత్ర కోసం ఫిజికల్ గా కూడా మేకోవర్ అయ్యే అవకాశం ఉంది. ఈ భారీ విజువల్ స్పెక్టకిల్ లోని రహస్యాలు ఏంటి? ఆ యోధుడు ఎదుర్కొనే శక్తులు ఎలాంటివి? అనే ప్రశ్నలు ఇప్పుడు ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. షూటింగ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మొత్తానికి SDT19 ఒక భారీ ప్రయోగంగానే కనిపిస్తోంది. కేవలం కమర్షియల్ హంగామా కోసమే కాకుండా, కంటెంట్ లో కూడా దమ్ము ఉంటే సాయి తేజ్ ఖాతాలో మరో 100 కోట్ల హిట్ చేరడం ఖాయం.