తేజ్ సంబరాల తర్వాత ప్లాన్ ఏంటో..?
ఈమధ్య యువ హీరోలంతా కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా లేదా రెండు సినిమాలు లైన్ లో పెడుతున్నారు.
By: Tupaki Desk | 27 Jun 2025 10:30 PMమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రోహిత్ డైరెక్షన్ లో సంబరాల యేటిగట్టు సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ మూవీగా ఇది వస్తుంది. ఈ సినిమా లో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఒక అదిరిపోయే గ్లింప్స్ తో వచ్చిన సంబరాల యేటిగట్టు టీం ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఇయర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
తేజ్ సినిమా అంటే మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి ఉంటుంది. మామయ్యలలో ఉన్న ఎనర్జీని కొనసాగిస్తూ సాయి తేజ్ చేస్తున్న ప్రాజెక్ట్ లు మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తాయి. ఇక తేజ్ సంబరాల యేటి గట్టు సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఈ సినిమా తర్వాత తేజ్ చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది డీటైల్స్ బయటకు రాలేదు.
ఈమధ్య యువ హీరోలంతా కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా లేదా రెండు సినిమాలు లైన్ లో పెడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేసే స్టార్స్ సైతం ఒక దాని తర్వాత మరొకటి అనేలా లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తేజ్ మాత్రం తన ఫోకస్ అంతా కూడా సంబరాల యేటి గట్టు మీద మాత్రమే పెట్టాడు. ఆ తర్వాత సినిమా ఏంటి అన్నది డిసైడ్ చేయలేదు. తేజ్ కనీసం కథలు అయినా వింటున్నాడా లేదా అన్నది కూడా క్లారిటీ రాలేదు.
సంబరాల యేటిగట్టు సినిమా పూర్తైన తర్వాతే తేజ్ తన నెక్స్ట్ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా తేజ్ ఇకమీదట కాస్త స్పీడ్ పెంచితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. సంబరాల యేటిగట్టు సెప్టెంబర్ రిలీజ్ అయితే నెక్స్ట్ సినిమా వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బెటర్ అని భావిస్తున్నారు. మరి సాయి ధరం తేజ్ నెక్స్ట్ సినిమా విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.
తేజ్ సంబరాల యేటిగట్టు కూడా సెప్టెంబర్ రిలీజ్ అన్నారు కానీ ఆ టైం కు వస్తుందా లేదా అన్నది కూడా క్లారిటీ రాలేదు. సో సినిమా వాయిదా పడితే అది పూర్తయ్యే వరకు దాని మీదే సాయి తేజ్ ఫోకస్ ఉంటుందని చెప్పొచ్చు.