శ్రీ అనంత పద్మనాభుని సన్నిధిలో మెగా హీరో స్పెషల్ లుక్
టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బిగ్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైంది. చివరగా 2023 బ్రో సినిమాలో నటించాడు.
By: Tupaki Desk | 17 July 2025 3:24 PM ISTటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బిగ్ స్క్రీన్ కు గ్యాప్ ఇచ్చి చాలా కాలమైంది. చివరగా 2023 బ్రో సినిమాలో నటించాడు. ఆ తరువాత మరో సినిమా కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కొత్త సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నా కూడా, ధార్మికతకు ప్రాధాన్యత ఇస్తూ దేవాలయ సందర్శన చేశారు. ఇటీవలే విడుదలైన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో, అతని ప్రయాణం పై కూడా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు శ్రద్ధతో స్వామి దర్శనం చేసుకున్న ఫొటోలు వెలుగు చూడడంతో మళ్లీ మంత్రముగ్ధులయ్యారు అభిమానులు. సాయి ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొత్తగా ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ సినిమాకోసం మాసివ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసిన సాయి, ప్రస్తుతం ప్రాజెక్ట్‌తో పాటు పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు.
లేటెస్ట్ ఫొటోలలో సాయి ధరమ్ తేజ్ సంప్రదాయ ధోతి కట్టుకుని, తెల్ల చొక్కాతో కనిపించారు. ఈసారి సాయి ధరమ్ తేజ్ తన బృందంతో కలసి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయం వెలుపల స్థానికులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ ఆలయ దర్శన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఆలయానికి వెళ్లే ముందు సాయి తమిళనాడులోని మరో ప్రసిద్ధ శివక్షేత్రాన్ని కూడా సందర్శించారు. అక్కడ కూడా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆయన లుక్ ప్రత్యేకంగా నిలిచింది. ఆధ్యాత్మికతతో పాటు తన వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు.
ఇక సినిమాల పరంగా చూస్తే, సెప్టెంబర్ 25న విడుదల కానున్న 'సంబరాల ఏటి గట్టు' సినిమా కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. 125 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
