స్పెషల్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ టైటిల్.. మెగా మేనల్లుడి నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
పరువేట అనే నేమ్ సాధారణం టైటిల్ కాదు. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక ఉత్సవానికి ఈ పేరు ఉంది.
By: M Prashanth | 6 Jun 2026 5:00 PM ISTమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్ ను కొత్త వేలోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, ఆ తర్వాత సేవ్ ద టైగర్స్ ఫేమ్ తేజ కాకమాను దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రానికి పరువేట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.
పరువేట అనే నేమ్ సాధారణం టైటిల్ కాదు. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే ప్రత్యేక ఉత్సవానికి ఈ పేరు ఉంది. పీరియాడిక్ అండ్ కల్చరల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఆ టైటిల్ ను సినిమాకు సెలెక్ట్ చేయడం వెనుక కూడా కథకు సంబంధించిన ప్రత్యేకత ఉందని తెలుస్తోంది. టైటిల్ నే చూసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఆ ప్రాజెక్ట్ లో సాయి తేజ్ ను ఆకట్టుకున్న ప్రధాన అంశం కథలోని కొత్తదనం అని వినికిడి. సాధారణ కమర్షియల్ కథలకు భిన్నంగా ఇందులో హీరోతో పాటు ఒక పులి కూడా కీలక పాత్రలో కనిపించనుందట. కథలో పులి రోల్ కథను ముందుకు నడిపించే ప్రధాన అంశంగా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ తరహా కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా కనిపించడంతో సాయి తేజ్ కూడా దీనిపై ఆసక్తి చూపినట్లు సమాచారం.
ఇటీవల కాలంలో సాయి దుర్గ తేజ్ తన సెలెక్షన్స్ లో క్లియర్ ఛేంజ్ చూపిస్తున్నారు. విరూపాక్ష వంటి మిస్టిక్ థ్రిల్లర్, బ్రో వంటి ఫాంటసీ డ్రామా, సంబరాల ఏటిగట్టు వంటి పీరియాడిక్ డ్రామా తర్వాత మళ్లీ మరో కొత్త తరహా కథను ఎంచుకోవడం.. ప్రయోగాలు చేసి మెప్పించాలన్న కోరిక ఆయనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆడియన్స్ కు కొత్త ఎక్స్పీరియన్స్ అందించే కథలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతుంది.
మరోవైపు దర్శకుడు తేజ కాకమానుపై కూడా సాయి తేజ్ కు నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో విడుదలైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తో తేజ కాకమాను మంచి గుర్తింపు సంపాదించారు. సాధారణ కుటుంబ కథను ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కామెడీని నేచురల్ గా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
ఇప్పుడు పరువేటలో కూడా ఎంటర్టైన్మెంట్ కు పెద్దపీట వేస్తూ యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ యాడ్ చేయనున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకట్టుకునేలా కథను రూపొందిస్తున్నారట. ఆ బ్యాలెన్స్ సాయి దుర్గ తేజ్ ను ప్రాజెక్ట్ వైపు ఆకర్షించిన మరో కారణంగా టాక్. పరువేట ఉత్సవానికి సంబంధించిన ఫీలింగ్ ను మోడ్రన్ స్టోరీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది కథకు ప్రత్యేకతను తీసుకురావచ్చని సమాచారం.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఇతర క్యాస్టింగ్, టెక్నీషియన్స్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కొత్త కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ టైటిల్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందనున్న పరువేటపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. మరి ఆ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
