అల్లు అర్జున్ - అట్లీ మూవీకి 21 ఏళ్ల కుర్రాడు మ్యూజిక్!
అనౌన్స్‌మెంట్ వీడియోతోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ కు మరో యంగ్ సెన్సేషన్ తోడయ్యాడు.
By: Tupaki Desk | 9 April 2025 11:48 AM IST`పుష్ప 2`తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ తరువాత మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. `పుష్ప2`తో రికార్డుల్ని బ్రేక్ చేయడమే కాకుండా హీరోగా తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న బన్నీ దీని తరువాత అంతకు మించిన సినిమాతో ఊహించని కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేశాడు. ఇందు కోసం తమిళ డైరెక్టర్ అట్లీని ఎంచుకుని అందరికి షాక్ ఇచ్చాడు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
బన్నీ 22వ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ని మేకర్స్ ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టిరోజు సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురాబోతున్నారు. పాపులర్ హాలీవుడ్ మూవీస్ అవతార్, ఐరన్‌మ్యాన్, అవెంజర్స్ వంటి క్రేజీ సినిమాలకు గ్రాఫిక్స్ అందించిన టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయబోతున్నారు.
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో రూపొందనున్న ఈ మూవీలో బన్నీ రెండు విభిన్నమైన పాత్రలో సూపర్‌మెన్ తరహా క్యారెక్టర్‌లో కనిపించనున్నాడట. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే హాట్ టాపిక్‌గా మారిన ఈ ప్రాజెక్ట్ కు మరో యంగ్ సెన్సేషన్ తోడయ్యాడు. భారీ స్థాయిలో తెరపైకిరానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 21 ఏళ్ల అభ్యంకర్ సంగీతం అందించబోతున్నాడు. సూర్య హీరోగా ఆయన 45వ సినిమాని ఆర్.జె.బాలీజీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
దీనికి ముందు ఏ.ఆర్.రెహమాన్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నారు. అయితే ఫైనల్‌గా ఆ ఛాన్స్‌ని 21 ఏళ్ల యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రముఖ సింగర్స్ టిప్పు, హరిణిల ముద్దుల తనయుడైన అభ్యంకర్ `కచ్చి సేరా, ఆసాకూడా వంటి ప్రైవేట్ సాంగ్స్‌తో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రీసెంట్‌గా హీరోయిన్ మీనాక్షీ చౌదరితో చేసిన `సితిరపుతిరి` యూట్యూబ్‌ని ఊపేస్తోంది. ఇలాంటి టాలెంటెడ్ యంగ్ డైనమిక్ బన్నీ, అట్లీల ప్రాజెక్ట్‌కు తోడవ్వడంతో ఈ ముగ్గురు బ్లాస్టింగ్ బ్లాక్ బస్టర్‌ని అందించడం ఖాయం అనే చర్చ జరుగుతోంది.
