సాయి అభ్యంకర్.. ఇదే అవుట్ పుట్ ఇస్తేనే!
యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.
By: M Prashanth | 7 Sept 2025 2:00 AM ISTయువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో వేరే లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. అది కూడా ఒక్క మూవీ కూడా రిలీజ్ కాకముందే. ప్రస్తుతం ఏకంగా ఏడు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. తద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు అభ్యంకర్.
ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తోపాటు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వద్ద కీబోర్డ్ ప్రోగ్రామర్ గా వర్క్ చేయడం అభ్యంకర్ కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- ప్రముఖ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాకు సంగీతం అందించే సూపర్ ఛాన్స్ ను సాయి అభ్యంకర్ దక్కించుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కరుప్పు చిత్రానికి కూడా వర్క్ చేస్తున్నారు. కార్తీ సినిమాకు సంగీత అందిస్తున్నారు. ఈ బడా ప్రాజెక్టులతో పాటు డూడ్, బాల్టీ, బెంజ్ వంటి చిత్రాలకు కూడా సాయి అభ్యంకర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. అయితే తన సోలో సింగిల్ కచ్చి సెరాతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ ను దక్కించుకున్నారు సాయి అభ్యంకర్.
వరల్డ్ వైడ్ గా అత్యధిక సెర్చబుల్ సాంగ్స్ లో ఆ పాట ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత ప్రీతి ముకుందన్ తో ఆశ కూడా, మీనాక్షి చౌదరితో చేసిన సితిర పుతిరి సాంగ్స్ సూపర్ హిట్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజి వీకురా అనే పాట రూపొందించగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అదే సమయంలో చర్చ కూడా నడుస్తోంది.
కవర్ సాంగ్స్ కు గాను సాయి అభ్యంకర్ తన అత్యుత్తమ ప్రదర్శనను అందిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు విజి వీకురా కూడా అత్యుత్తమ ప్రొడక్షన్ వాల్యూస్ తో ఉందని చెబుతున్నారు. కానీ సినీ పరిశ్రమలో పెద్ద స్థాయికి అది సరిపోదని.. చాలా కాలం పాటు మనుగడ సాగించడానికి అద్భుతమైన అవుట్ పుట్ ఇవ్వాలని చెబుతున్నారు.
ఎందుకంటే రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ కు అభ్యంకర్ విమర్శలు ఎదుర్కొన్నారు. కవర్స్ సాంగ్స్ లో గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా.. డ్యూడ్ సాంగ్ తో నిరాశపరిచారని అనేక మంది అభిప్రాయపడ్డారు. అందుకే మరింత ఫోకస్ చేసి మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా తన రాబోయే చిత్రాలతో మెప్పించగలిగితే గొప్ప సంగీత దర్శకుడిగా ఎదగడం మాత్రం ఖాయం.
