Begin typing your search above and press return to search.

ఏజ్ 20 - ఇంకా ఒక్క సినిమా రాలేదు.. అప్పుడే 8 ఆఫర్లు!

ఇప్పటివరకు సాయి అభ్యంకర్‌కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ ఆయన లైన్ అప్ చూస్తేనే అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   10 July 2025 5:00 PM IST
ఏజ్ 20 - ఇంకా ఒక్క సినిమా రాలేదు.. అప్పుడే 8 ఆఫర్లు!
X

సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక్క ఛాన్స్ కొట్టాలంటే సంవత్సరాల పోరాటం అవసరం. కానీ ఈ మధ్యకాలంలో కొందరు యువ టాలెంట్లు కేవలం ఒకే ఒక్క మ్యూజిక్ సింగిల్‌ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాయి అభ్యంకర్. వయసు 20 ఏళ్ళు. సింగర్స్ టిప్పు - హారినిల కుమారుడు. అయితే అతని నుంచు ఇంకా తొలి సినిమా విడుదల కాకముందే టాప్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవుతూ సంచలనం సృష్టిస్తున్నాడు.

ఇప్పటివరకు సాయి అభ్యంకర్‌కి డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ ఆయన లైన్ అప్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం సూర్యతో కలిసి ‘కరుప్పు’ అనే సినిమాలో పని చేస్తున్నాడు. కార్తీ ‘మార్షల్’ కోసం కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే శివకార్తికేయన్ SK24 ప్రాజెక్ట్, అట్లీ - అల్లు అర్జున్ కాంబోలో రూపొందే భారీ చిత్రం AA22, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, లోకేష్ కనగరాజ్ LCUలో లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న బెంజ్ కూడా అతడి ఖాతాలోనే ఉన్నాయి.

ఇంతే కాదు, శింబుతో (STR) రామ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో ప్రాజెక్ట్‌, అలాగే మలయాళ స్టార్ షేన్ నిగమ్ హీరోగా వస్తున్న బాల్టీ సినిమాతో కూడా అతడే మ్యూజిక్ డైరెక్టర్. అంటే మొత్తంగా 8 సినిమాలకు అవకాశం దక్కించుకున్నాడు. ఇందులో చాలా ప్రాజెక్టులు భారీ స్థాయిలో ఉండటంతో, సాయి అభ్యంకర్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే సాయి అభ్యంకర్ చేసిన మ్యూజిక్ వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘కట్చి సేరి’, ‘ఆషా’, ‘సితిరా పుతిరి’ లాంటి సింగిల్స్‌కి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీతం పట్ల ఉన్న అభిమానం, ఫ్యూజన్ టచ్ కలిగిన కంపోజిషన్స్ ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.

సాయి అభ్యంకర్ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ కావడంతో మ్యూజిక్ చిన్నప్పటి నుంచే అలవాటుగా మార్చుకున్నాడు. రెహమాన్, మణిశర్మ, తమన్, అనిరుధ్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో అసిస్టెంట్‌గా పని చేసిన అనుభవం కూడా ఇప్పుడు ఆయనకు అస్త్రంగా మారింది. అలాగే బీజీఎం, ఇంటర్నేషనల్ టోన్ కంపోజింగ్ లో ప్రత్యేక పట్టు ఉండటం, అతడిని మరో లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇంత బిజీ లైన్ అప్ ఉన్నప్పటికీ, సాయి అభ్యంకర్‌పై నమ్మకంతో ప్రాజెక్టులు పట్టుకోవడటమే అతని టాలెంట్‌కు నిదర్శనం. ఇప్పుడు ఈ అంచనాలను నెరవేర్చడమే అతడి ముందు ఉన్న అసలు పరీక్ష.