Begin typing your search above and press return to search.

THE 100.. మొగలి రేకులు హీరో మళ్ళీ వచ్చాడు!

బుల్లితెర టాప్ మొగలి రేకులు సీరియల్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2024 7:58 AM GMT
THE 100.. మొగలి రేకులు హీరో మళ్ళీ వచ్చాడు!
X

బుల్లితెర టాప్ మొగలి రేకులు సీరియల్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రలో నటించిన సాగర్ తన యాక్టింగ్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆర్కే నాయుడు రోల్ కు గాను నంది అవార్డు కూడా అందుకున్నారు. ఈ స్క్రీన్ నేమ్ తోనే పాపులర్ అయ్యారు. చక్రవాకం సీరియల్ తో కూడా అలరించారు.


సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆర్కే సాగర్. సిద్ధార్థ‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌, షాదీ ముబార‌క్ సినిమాల్లో నటించారు. వాటిలో షాదీ ముబార‌క్ మూవీ.. సాగర్ కు మంచి స‌క్సెస్‌ ను అందించింది. మ‌న‌సంతా నువ్వే, మిస్ట‌ర్ ప‌ర్‌ ఫెక్ట్ చిత్రాల్లో చిన్న రోల్స్ లో కనిపించారు. ఇప్పుడు లీడ్ రోల్ లో 100 పేరుతో సినిమా చేస్తున్నారు ఆర్కే సాగర్.


యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని రాఘవ్ ఓంకార్ శశిధర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మిషా నారంగ్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ ను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌ నాయుడు లాంఛ్ చేశారు. ప్రస్తుతం మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో సాగ‌ర్... ఐపీఎస్ విక్రాంత్ రోల్ లో క‌నిపించ‌బోతున్నారు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ లో పోలీస్ గెటప్ లో గ‌న్ ప‌ట్టుకుని ఇంటెన్స్ లుక్‌ లో క‌నిపించి ఆకట్టుకుంటున్నారు సాంగ్. ఇక మోషన్ పోస్టర్.. నెంబర్ 100 ఇంపార్టెన్స్ ను చెబుతూ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం ఒక నెంబర్ కాదు, ఇది ఒక ఆయుధం అని వస్తున్న డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఇక ఈ మూవీకి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యానిమ‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. గిరిధర్, ఆనంద్, లక్ష్మీ గోపాల్ స్వామి, కళ్యాణి నటరాజన్, జయంత్, యాంకర్ విష్ణు ప్రియ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.