ప్రభాస్ సినిమా లో ఆ పాత్ర చేసి తప్పు చేసా!
'మొగలి రేకులు' సీరియల్ ఫేం సాగర్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగిన నటుడు కాలక్రమంలో సినిమాలకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 July 2025 1:00 AM IST'మొగలి రేకులు' సీరియల్ ఫేం సాగర్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లి తెరపై ఓ వెలుగు వెలిగిన నటుడు కాలక్రమంలో సినిమాలకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. తాజాగా 'ది 100' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించడం విశేషం. పోలీస్ పాత్రతోనే బుల్లి తెరపై సాగర్ బాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆర్కే నాయుడు పాత్ర అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. బుల్లితెర పైనా ఓ ఐకానిక్ రోల్ గా ఖ్యాతికెక్కింది. ఈ సినిమాలో కూడా ఆవేశం .. ఆదర్శం పుష్కలంగా కనిపించే పాత్ర ఇది. వినోదం .. సందేశం కలగలిసిన కంటెంట్ ఉన్న సినిమా. తాజాగా ఈ సినిమా ప్రచారం నేపథ్యంలో ప్రభాస్ తో 'మిస్టర్ పర్పెక్ట్'సినిమా చేసి పెద్ద తప్పు చేసానని సంచంలన వ్యాఖ్యలు చేసాడు. 'సినిమాలే చేయాలని నిర్ణయించుకున్న సమయంలో 'మిస్టర్ పెర్ఫెక్ట్'అవకాశం వచ్చింది. అందులో నాది ఒక ముఖ్యమైన పాత్రగా చెప్పారు.
ప్రభాస్ తరువాత హైలైట్ అయ్యే రోల్ అదే అన్నారు. కానీ ఆ పాత్ర గొప్పదనం షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే అర్దమైంది. ఇదే విషయాన్ని దర్శకుడిని అడిగితే ఆయన నుంచి నాకు సరైన సమాధానం రాలేదు. దీంతో ఆ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాను. అయినా ఆ పాత్రను తీసేయకుండా అలాగే రిలీజ్ చేసారు. ఆ పాత్రను తీసేస్తే బాగుండేది. ఆ రోల్ చేసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఎందుకు చేసానా? అని చాలాసార్లు ఆలోచించాను. ఇండస్ట్రీకి వచ్చి చేసిన అతి పెద్ద తప్పుగా కనబడింది.
అప్పటికే నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. అలాంటి గుర్తింపు లేనప్పుడు ఎలాంటి పాత్ర పోషించిన పర్వా లేదు' అన్నారు. చిరంజీవి తల్లి, మెగా డాటర్ అంజనా దేవి సాగర్ కు అభిమాని అన్న సంగతి తెలిసిందే. సాగర్ నటించిన సీరియల్స్ తప్పక చూస్తారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదు గానే కొత్త సినిమాకు సంబంధించిన ఓ లాంచింగ్ కార్యక్రమం కూడా చేసారు. సాగర్ కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారాయన.
