సచిన్ టెండూల్కర్ ఫేవరెట్ మూవీగా సిద్ధార్థ్ కొత్త మూవీ.. ప్రత్యేకత ఏంటంటే?
సాధారణంగా అటు హీరోలైనా.. ఇటు క్రీడా, రాజకీయ రంగానికి చెందిన వారైనా తమ తమ దైనందిక జీవితంలో బిజీగా ఉండడం వల్ల సినిమాలు చూడడానికి కూడా సమయం ఉండదు.
By: Madhu Reddy | 28 Aug 2025 4:00 AM ISTసాధారణంగా అటు హీరోలైనా.. ఇటు క్రీడా, రాజకీయ రంగానికి చెందిన వారైనా తమ తమ దైనందిక జీవితంలో బిజీగా ఉండడం వల్ల సినిమాలు చూడడానికి కూడా సమయం ఉండదు. కానీ అంత బిజీ లైఫ్ స్టైల్ లో కూడా ఒక స్టార్ క్రికెటర్ ఒక సినిమా చూశానని, అది తనను చాలా ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చారు. ఆయన ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. భారత దిగ్గజ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఈయన రిటైర్ అయినప్పటికీ కూడా ఇతర కార్యకలాపాలతో తన దైనందిక జీవితంలో బిజీగా గడిపేస్తూ ఉంటారు. అయితే అంత బిజీ లైఫ్ స్టైల్ లో కూడా ఆయన ఒక సినిమా చూశానని.. ఆ సినిమా ఇప్పుడు తనకు ఫేవరెట్ మూవీగా మారిపోయింది అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు మరి సచిన్ టెండూల్కర్ ఇటీవల కాలంలో చూసిన సినిమా ఏంటి? ఆయనను మెప్పించిన ఆ సినిమా విశేషాలేంటి? అంతలా మెప్పించడానికి అందులో ఏముంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే సచిన్ ఇటీవల అభిమానులతో ముచ్చటిస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగానే ఒక అభిమాని సచిన్ టెండూల్కర్ తో.." మీరు కొత్త సినిమాలు చూడడానికి సమయం కేటాయిస్తారా? అసలు మీకు టైం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి సినిమాలు చూశారు? "అని ప్రశ్నించారు. దానికి సచిన్ సమాధానం ఇస్తూ.. "సమయం దొరికినప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాను. ఈ క్రమంలోనే తాజాగా నేను 3BHK, అటా తంబైచా నాయ్ సినిమాలు చూశాను" అంటూ చెప్పుకొచ్చారు.
'అటా తంబైచా నాయ్' అనే మరాఠి మూవీ విషయానికి వస్తే.. నైట్ స్కూలులో ఎస్ఎస్సి చదువుతున్న శ్రామిక తరగతి పెద్దల గురించిన మరాఠీ చిత్రం ఇది. అటు పని ఇటు చదువులను సమతుల్యం చేస్తూ జీవితంలో అనుకున్నది ఎలా సాధించారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. మరోవైపు మధ్యతరగతి కుటుంబ నాటకంగా తెరకెక్కిన తమిళ్ మూవీ 3BHK.. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత 3BHK ఫ్లాట్ ను కొనుగోలు చేసేటప్పుడు జీవితంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనే విషయాన్ని చక్కగా చూపిస్తూ సామాన్యుడి జీవితాన్ని తెరపై చూపించినట్టు అనిపించింది. ఈ రెండు చిత్రాలు తనని విపరీతంగా ఆకట్టుకున్నాయని సచిన్ టెండూల్కర్ తెలిపారు.
3 BHK సినిమా విషయానికి వస్తే.. శ్రీ గణేష్ రచనా దర్శకత్వంలో శాంతి టాకీస్ బ్యానర్ పై అరుణ్ విశ్వ నిర్మించారు. సిద్ధార్థ్, ఆర్.శరత్ కుమార్, దేవయాని, మితా రఘునాథ్, చైత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. యోగిబాబు, సుబ్బు పంచు, వివేక్ ప్రసన్న, తలైవాసల్ విజయ్ సహాయక పాత్రల్లో రూపొందిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సామాన్యుడి నిజ జీవితాన్ని అద్దం పడుతూ.. సొంత ఇంటి కల అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుక్కోవడమే కాకుండా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది.
