Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిన‌ మొట్ట‌మొద‌టి భార‌తీయ న‌టుడు

భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ నటుడు సాబు దస్తగిర్ న‌టించిన సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండ‌దు.

By:  Tupaki Desk   |   19 July 2025 9:21 AM IST
వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిన‌ మొట్ట‌మొద‌టి భార‌తీయ న‌టుడు
X

భార‌త‌దేశం నుంచి చాలా మంది ప్ర‌తిభావంతులు హాలీవుడ్ లో న‌టించారు. ఇటీవ‌లి కాలంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు నుంచి ప‌లువురు న‌టీన‌టులు హాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌డం చ‌ర్చ‌గా మారింది. ఇదిలా ఉంటే భార‌త‌దేశం నుంచి మొట్ట‌మొద‌టి ప్ర‌పంచ స్టార్ (న‌టుడు) ఎవ‌రో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది. అలాంటి ఒక న‌టుడు ఉంటే, అత‌డు ఎవ‌రో క‌నిపెట్ట‌గ‌ల‌రా? అంటే.. అత‌డి పేరు సాబు ద‌స్త‌గిర్. మైసూర్ నుంచి హాలీవుడ్ వ‌ర‌కూ అత‌డు సాగించిన ప్ర‌యాణం ఎంతో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ది. నాటి సంస్కృతి, వార‌స‌త్వం, ప్ర‌పంచ యుద్ధాల‌ను కూడా అత‌డి క‌థ ప‌రిచ‌యం చేస్తుంది. అందుకే ఇప్పుడు సాబు ద‌స్త‌గిర్ జీవిత‌క‌థ‌ను వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి.

భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ నటుడు సాబు దస్తగిర్ న‌టించిన సినిమాల జాబితాను ప‌రిశీలిస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. అవ‌న్నీ మ‌నం ఏదో ఒక రోజు చూసి ఉండొచ్చు. కానీ వాటిలో ఒక భార‌తీయుడు న‌టించాడు అనేది గుర్తించ‌లేం. ప్రఖ్యాత రచయిత్రి దేబ్లీనా మజుందార్ రాసిన సినిమాటిక్ ఆత్మను కదిలించే జీవిత చరిత్ర ద‌స్త‌గిర్ ఒరిజిన‌ల్ క‌థ‌లో ఉంది. వలసరాజ్యాల భారతదేశం నుండి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ వరకు సాబు జీవితం కీర్తి, యుద్ధం, వార‌స‌త్వం, ఐడెంటిటీతో కూడుకున్న‌వి.

రుడ్యార్డ్ కిప్లింగ్ ది జంగిల్ బుక్ (1894) నుండి `టూమై ఆఫ్ ది ఎలిఫెంట్స్` కథ ఆధారంగా రూపొందించిన‌ సాబు `ఎలిఫెంట్ బాయ్`లో అరంగేట్రం చేశాడు. దీనిని డాక్యుమెంటరీ చిత్రనిర్మాత రాబర్ట్ జె. ఫ్లాహెర్టీ దర్శకత్వం వహించాడు. పర్యవేక్షక దర్శకుడు జోల్టాన్ కోర్డా ఈ చిత్రాన్ని పూర్తి చేసి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడి అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ చిత్రం డెన్హామ్ - మైసూర్‌లోని లండన్ ఫిల్మ్స్ స్టూడియోస్‌లో నిర్మించారు.

ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్, జంగిల్ బుక్ (1942), బ్లాక్ నార్సిసస్ వంటి హాలీవుడ్ క్లాసిక్‌లలోను ద‌స్త‌గిర్ నటించాడు. అతడు 1960లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించాడు. వలసరాజ్యాల భారతదేశం, యుద్ధకాల యూరప్, స్వర్ణయుగ హాలీవుడ్ తో సంబంధం ఉన్న ఏకైక‌ న‌టుడు సాబు ద‌స్త‌గిర్. అందుకే అతడి జీవిత ప్ర‌యాణాన్ని వెండి తెర‌కెక్కించ‌డం అంత సులువు కాదు. దీనికోసం అత్యంత భారీ బ‌డ్జెట్ ని కేటాయించాల్సి ఉంది.