Begin typing your search above and press return to search.

జిమ్ లో తెలుగమ్మాయి వర్కౌట్స్.. క్యూట్ సెల్ఫీలు చూశారా?

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శాన్వీ.. తాజాగా క్యూట్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. హైదరాబాద్ లోని ఓ ఫిట్ నెస్ స్టూడియోలో దిగిన పిక్స్ షేర్ చేసిన అమ్మడు.. తన వర్కౌట్స్ రిజల్ట్ ను చూపించేసింది!

By:  Tupaki Desk   |   19 April 2025 12:00 AM IST
జిమ్ లో తెలుగమ్మాయి వర్కౌట్స్.. క్యూట్ సెల్ఫీలు చూశారా?
X

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అనేక మంది తెలుగమ్మాయిలు తమ టాలెంట్ తో రానిస్తున్నారు. మంచి ఛాన్సులు అందుకుని అదరగొడుతున్నారు. అలాంటి వారిలో శాన్వి మేఘన కూడా ఒకరు.

హైదరాబాద్ బ్యూటీ అయిన ఆమె.. తక్కువ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుందనే చెప్పాలి. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది అమ్మడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శాన్వీ.. తాజాగా క్యూట్ సెల్ఫీలను పోస్ట్ చేసింది. హైదరాబాద్ లోని ఓ ఫిట్ నెస్ స్టూడియోలో దిగిన పిక్స్ షేర్ చేసిన అమ్మడు.. తన వర్కౌట్స్ రిజల్ట్ ను చూపించేసింది! బ్లాక్ టాప్, కలర్ ఫుల్ షార్ట్ వేసుకున్న బ్యూటీ.. తన కర్లీ హెయిర్ తో బ్యూటిఫుల్ గా ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

ఇన్స్పిరేషన్ కాదు.. డిసిప్లైన్ గురించి ఆలోచించండంటూ ఇచ్చి క్యాప్షన్ బట్టి ఆమె డెడికేషన్ ఎలా ఉందో క్లియర్ గా చెప్పవచ్చు. మొత్తానికి శాన్వీ పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని నిమిషాల్లో వేలల్లో లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయి. సో క్యూట్ మేడమ్ అని నెటిజన్లు చెబుతున్నారు. సూపరో సూపర్ అని అంటున్నారు.

ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన శాన్వీ మేఘన.. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మూవీతో తన సినీ జర్నీని స్టార్ట్ చేసింది. 2019లో ఆ సినిమా రిలీజైంది. ఆ తర్వాత నెట్‌ ఫ్లిక్స్ తెలుగు ఒరిజినల్ పిట్ట కథలు (2021)తో మంచి గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. అనంతరం వివిధ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వచ్చాయి.

బిలాల్‌ పూర్ పోలీస్ స్టేషన్, పుష్పక విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అమ్మడు. కోలీవుడ్ లో కుటుంబస్థాన్ మూవీ చేసి మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత రీసెంట్ గా తెలుగులో టుక్ టుక్ మూవీతో సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ ఆఫర్స్ అందుకునేందుకు ట్రై చేస్తోంది శాన్వీ మేఘన. తన టాలెంట్ తో ఓ రేంజ్ లో మెప్పించాలని ఉవ్విళ్లూరుతోంది. తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది అమ్మడు. మరి శాన్వీకి ఫ్యూచర్ లో ఎలాంటి ఛాన్సులు వస్తాయో.. ఎలాంటి విజయాలు అందుకుంటుందో అంతా వేచి చూడాలి.