Begin typing your search above and press return to search.

OGలో కూడా సాహో లింకా?

ఒజీ సినిమాని సాహోకి కనెక్ట్ చేస్తున్నట్లు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2023 2:09 PM GMT
OGలో కూడా సాహో లింకా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఒజీ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి మెజారిటీ సీక్వెన్స్ ని సుజిత్ కంప్లీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ 30 రోజులు కాల్ షీట్స్ కేటాయిస్తే అతనికి సంబందించిన సన్నివేశాలు అన్ని కంప్లీట్ కానున్నాయని తెలుస్తోంది .

ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మీ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వారు ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుజిత్ ఒజీ కంటే ముందుగా సాహో సినిమా ప్రభాస్ తో చేశారు.

ఈ చిత్రంలో వాజీ అనే సిటీ ఉంటుంది. ఆ సిటీ బ్యాక్ డ్రాప్ లోనే కథ ఉంటుంది. మాఫియా హెడ్ క్వార్టర్ గా వాజీ సిటీని రిప్రజెంట్ చేశారు. తాజాగా ఒజీ మూవీకి సంబందించిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. వాటిలో వాజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుని ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో ఒజీ సినిమాని సాహోకి కనెక్ట్ చేస్తున్నట్లు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. స్పందిస్తున్నారు. అసలు సాహో సినిమాతో ఒజీని ఎలా కనెక్ట్ చేస్తారంటూ క్వచ్చన్ చేస్తున్నారు. అలాగే సాహోతో స్టొరీని కలిపి మొత్తానికి సుజిత్ చెడగొట్టేలా ఉన్నాడంటూ మరొకరు కామెంట్స్ చేశారు.

అయితే ఈ పేరు యాదృశ్చికంగా పెట్టిన పేరు అయ్యుంటుంది తప్ప సాహో కథకి ఒజీతో ఏ విధంగా సంబంధం ఉండే ఛాన్స్ లేదనే మాట కూడా వినిపిస్తోంది. ఒజీ కంప్లీట్ గా ఒక గ్యాంగ్ స్టార్ స్టొరీ అని, అయితే సాహో మూవీ మాఫియా ఎలివేషన్ క్లైమాక్స్ లో మాత్రమే ఉంటుందని అంటున్నారు. మరి ఈ రెండింటిలో వాస్తవం ఏది అనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే.