Begin typing your search above and press return to search.

రూ.4 కోట్ల రేంజ్‌... సాహో బ్యూటీ వైరల్‌

దసరా సందర్భంగా తన గ్యారేజ్ లోకి నాలుగు కోట్ల రూపాయలతో ఈ లంబోర్ఘిని కొత్త మోడల్ కారును ఆహ్వానించినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా శ్రద్దా కపూర్ చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 6:19 AM GMT
రూ.4 కోట్ల రేంజ్‌... సాహో బ్యూటీ వైరల్‌
X

సాధారణంగా హీరోలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి లంబోర్ఘిని కారును కొనుగోలు చేశారు అంటూ వార్తలు వింటూ ఉంటాం. గతంలో సౌత్ హీరోలతో పాటు బాలీవుడ్‌ హీరోలు ఎంతో మంది లంబోర్ఘిని కారు ను కొనుగోలు చేసి వార్తల్లో నిలవడం జరిగింది. అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఈ అతి ఖరీదైన లంబోర్ఘిని కారును కొనుగోలు చేయడం జరిగింది.

లంబోర్ఘిని కారు కొనుగోలు చేసిన అతి కొద్ది మంది హీరోయిన్స్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ నిలిచింది. ప్రభాస్ తో సాహో సినిమా చేయడం ద్వారా సౌత్ లో కూడా మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్ము శ్రద్దా కపూర్‌ తన కొత్త కారుతో ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

దసరా సందర్భంగా తన గ్యారేజ్ లోకి నాలుగు కోట్ల రూపాయలతో ఈ లంబోర్ఘిని కొత్త మోడల్ కారును ఆహ్వానించినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా శ్రద్దా కపూర్ చెప్పుకొచ్చింది. హీరోయిన్‌ గా ప్రస్తుతం స్టార్‌ డమ్ తో దూసుకు పోతూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ జాబితాలో ఉంది. కనుక ఈ రేంజ్ కారు ఆమెకు పెద్ద కష్టం ఏమీ కాదు అనేది టాక్‌.

లంబోర్ఘిని కారు ముందు శ్రద్దా కపూర్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి వాటిని సోషల్ మీడియా లో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం శ్రద్ద కపూర్‌ ఒక హిందీ సినిమాలో రాజ్‌ కుమార్‌ రావు తో కలిసి నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కు ముగిసే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి బిజీ బ్యూటీ రూ.4 కోట్ల రేంజ్ కారు కొనుగోలు చేసి ఇది నా రేంజ్ అంటూ ఫోటో లు షేర్ చేసి వైరల్ అయింది.