Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ హాస్య న‌టుడిపై లైంగిక వేధింపుల కేసు

మీటూ ఉద్య‌మంలో చాలామంది క‌థానాయిక‌లు, స‌హాయ‌న‌టీమ‌ణులు త‌మ‌పై జ‌రిగిన‌ లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   5 April 2025 6:00 PM IST
ప్ర‌ముఖ హాస్య న‌టుడిపై లైంగిక వేధింపుల కేసు
X

మీటూ ఉద్య‌మంలో చాలామంది క‌థానాయిక‌లు, స‌హాయ‌న‌టీమ‌ణులు త‌మ‌పై జ‌రిగిన‌ లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగా వెల్ల‌డించారు. కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వేధింపుల‌ మాన్ స్ట‌ర్స్ పై విచార‌ణ సాగింది. కానీ భార‌త‌దేశంలో చాలా కేసులు ఆధారాల‌తో నిరూపించ‌లేని స్థితిలో నీరుగారాయి.

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ పైనా కేసును ఇటీవ‌ల కోర్టు కొట్టి వేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా హాలీవుడ్ న‌టుడు రస్సెల్ బ్రాండ్ పై అత్యాచారం, లైంగిక వేధింపుల అభియోగం న‌మోదైంది. న‌టుడు బ్రాండ్ పై అత్యాచారం, అసభ్యకరమైన దాడి, నోటితో అత్యాచారం వంటి ఒక్కొక్క అభియోగం మోపారు. ఆ మేర‌కు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

బ్రాండ్ హాలీవుడ్ లో అసాధారణమైన ప్ర‌తిభ ఉన్న‌ స్టాండ్-అప్ కమెడియన్‌గా సుప్ర‌సిద్ధుడు. పాప్ స్టార్ కేటీ పెర్రీ మాజీ భర్తగా అంతర్జాతీయంగాను సుప‌రిచితుడు. అత‌డిపై అత్యాచారం కేసు న‌మోదైంద‌ని వార్తా సంస్థ ఏపీ వివ‌రాలు అందించింది. ఈ నేరాలు అన్నీ 1999 - 2005 మధ్య జరిగాయి. బ్రాండ్ మే 2న లండన్ కోర్టులో హాజరు కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు ద్వారా ప్రభావితమైన ఎవరైనా లేదా ఏదైనా సమాచారం ఉన్న ఎవరైనా ముందుకు వచ్చి పోలీసులతో మాట్లాడాలని డిటెక్టివ్‌లు కోరుతున్న‌ట్టు క‌థ‌నాలొచ్చాయి.

సెప్టెంబర్ 2023లో బ్రిటిష్ మీడియా సంస్థలు ఛానల్ 4 , సండే టైమ్స్ బ్రాండ్ వ‌ల్ల‌ లైంగిక వేధింపుల‌కు లేదా అత్యాచారానికి గురైనట్లు నలుగురు మహిళలు ఆరోపించిన‌ట్టు క‌థ‌నాలు వేసాయి. బ్రాండ్ పనిచేసిన ఛానల్ 4 షోలలో కొన్నింటిని నిర్మించిన కంపెనీని కొనుగోలు చేసిన బనిజయ్ స‌రిగా స్పందించ‌క‌పోవ‌డంతో ఈ నిజాలు బ‌య‌ట‌కు తెలియ‌లేదు. డిస్పాచెస్ అనే కార్యక్రమంలో వేధింపుల ప్ర‌హ‌సనం బ‌య‌ట‌ప‌డింది. కానీ ఛానల్ 4 దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు లభించలేదు.

రస్సెల్ బ్రాండ్ ఎవరు?

రస్సెల్ బ్రాండ్ ఒక హాస్యనటుడు.. ఆంగ్ల చాన‌ళ్ల‌లో పాపుల‌ర్ అయ్యాడు. అతడు హద్దులు లేని అశ్లీల స్టాండప్ షోల‌తో పాపుల‌ర‌య్యాడు. రేడియో, టెలివిజన్‌లలో షోలను హోస్ట్ చేశాడు. మాదకద్రవ్యాలు, మద్యంతో తన పోరాటాలను జ్ఞాపకాలను పుస్త‌కంగా రాశాడు. బ్రాండ్ అనేక హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. 2010- 2012 మధ్య పాప్ స్టార్ కేటీ పెర్రీని పెళ్లాడి సంసార జీవ‌నం సాగించాడు. కానీ ఈ జంట విడిపోయింది.