Begin typing your search above and press return to search.

ర‌స్కిన్ బాండ్ లవ్ స్టోరీలో అత‌నా?

ర‌స్కిన్ బాండ్ జీవితంలో ఎన్నో కోణాలున్నాయి. అందులో బాండ్ ప్రేమ క‌థ‌ని ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు

By:  Tupaki Desk   |   1 Sep 2023 1:30 AM GMT
ర‌స్కిన్ బాండ్ లవ్ స్టోరీలో అత‌నా?
X

ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత ర‌స్కిన్ బాండ్ న‌వ‌ల‌లు వ‌ర‌ల్డ్ వైడ్ ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ర‌చ‌న‌లు ఆధారంగా ఇప్ప‌టికే ఎన్నో సినిమాలొచ్చాయి. ' జునూన్' ..'ది బ్లాక్ క్యాట్'..'7 ఖూన్ మాఫ్' ..'నీలి ఛత్రి' లాంటి ఎన్నో సినిమాలొచ్చాయి. ఇంకా మ‌రెన్నో టీవీ సీరిస్ లు కూడా రిలీజ్ అయ్యాయి. బాండ్ ఇమేజ్ తో అవి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. తాజాగా బాలీవుడ్ క‌థానాయ‌కుడు 'విక్రాంత్ మాస్సే' కూడా ర‌స్కిన్ బాండ్ ప్రేమ క‌థ‌ని చాటి చెప్ప‌డానికి రెడీ అవుతున్నాడు.

ర‌స్కిన్ బాండ్ జీవితంలో ఎన్నో కోణాలున్నాయి. అందులో బాండ్ ప్రేమ క‌థ‌ని ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బాండ్ లో రొమాంటిక్ ల‌వ్ యాంగిల్ ని ఈ సినిమా ద్వారా హైలైట్ చేయ‌బోతున్నారు. ఈసినిమాతో నిరంజ‌న్ అయ్యంగర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. 'క‌ల్ హో నాహో'..'మై నేమ్ ఈజ్ ఖాన్' లాంటి హిట్ చిత్రాల‌కు నిరంజ‌న్ ర‌చ‌యిత‌గా ప‌రిచేసారు.

బాండ్ ర‌చించిన 'ది రూమ్ ఆన్ ది రూఫ్' న‌వల నుంచి ఎన్నో క‌థ‌లు..వ్యాసాలు ర‌చించారు. వీటిలోని కొన్ని అంశాల‌ను..బాండ్ జీవితంతో ప్రేమ‌ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతో బాండ్ ల‌వ్ స్టోరీ ఎలా ఉంటుందా? అన్న ఎగ్జైట్ మెంట్ ఓసెక్ష‌న్ ఆడిన్స్ లో క‌లుగుతోంది. బాండ్ వ్యాసాలు ఎంతో స్పూర్తిదాయ‌కంగా ఉంటాయి. ఆయ‌న స్పూర్తితో ఎంతో మంది ఉన్నత స్థానాల‌కు చేరుకున్నారు.

బాండ్ పాత్ర‌లో విక్రాంత్ మాస్సే క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రం. విక్రాంత్ 'లూటేరా' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అటుపై చాలా సినిమాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం హీరోగా బిజీగా ఉన్న న‌టుడాయ‌న‌. ఈ నేప‌థ్యంలో ర‌స్కిన్ బాండ్ ల‌వ్ స్టోరీలో న‌టించే అరుదైన అవ‌కాశం అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది. విక్రాంత్ కూడా నాలుగైదు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.