Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోపై పుకారు..నేటితో పుల్ స్టాప్!

వ్య‌క్తిగ‌తంగా..చ‌ట్ట‌ప‌రంగా ఇద్ద‌రు దూర‌మైనా! చీటికిమాటికీ ర‌క్త సంబంధాన్ని గుర్తు చేయ‌డంతో బ్యాకెండ్ లో ఏదో జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం సాగింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:35 PM GMT
ఆ స్టార్ హీరోపై పుకారు..నేటితో పుల్ స్టాప్!
X

టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోపై కొన్ని నెల‌లుగా ఓ బ‌ల‌మైన రూమ‌ర్ తిప్పుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌ను యాక్టివ్ పొలిటీష‌న్ కావ‌డంతో ఆ ప్ర‌చారంపై మ‌రింత ఆసక్తి నెల‌కొంది. అత‌ని వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఆ వార్త రావ‌డంతో! పాటు కొన్ని ర‌కాల సంకేతాలు అది నిజ‌మేనా? అని అనిపించేలా! సందేహాన్ని క‌లిగించాయి. అత‌ని వ్య‌క్తిగ జీవితంలో గ‌తంలో చోటు చేసుకున్న ఓ రెండు సంఘ‌ట‌న‌లు కార‌ణంగానూ ఇది నిజంగా నిజ‌మేనా? అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు.

ఎక్కువ‌గా ఒంట‌రిగానే క‌నిపించ‌డం...ఫ్యామిలీ ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో! చాలా నెగిటివ్ క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఇదే స‌మ‌యంలో ఓ మాజీ సైతం మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చి ఆ కుటుంబంతో ఉన్న రిలేష‌న్ షిప్ ని మీడియాలో హైలైట్ చేయ‌డం అంత‌కంత‌కు ఆస‌క్తి పెంచింది. వ్య‌క్తిగ‌తంగా..చ‌ట్ట‌ప‌రంగా ఇద్ద‌రు దూర‌మైనా! చీటికిమాటికీ ర‌క్త సంబంధాన్ని గుర్తు చేయ‌డంతో బ్యాకెండ్ లో ఏదో జ‌రుగుతుంద‌నే ప్ర‌చారం సాగింది.

అయితే అన్నింటికి నేటితో ఆ స్టార్ హీరో పుల్ స్టాప్ పెట్టేసాడు. మేమంతా సంతోషంగా ఉన్నాం...క‌లిసే ఉన్నాం... వ్య‌క్తిగ‌త జీవితం ఆనందంతోనే నిండి ఉంద‌ని ఇన్ స్టాలో వైర‌ల్ అవుతోన్న కొన్ని ర‌కాల ఫోటో ల‌తో పుల్ క్లారిటీ వ‌చ్చేసింది. కొన్ని నెల‌లు త‌ర్వాత ఇద్ద‌రు జంట‌గా క‌నిపించ‌డంతో అన్ని ర‌కాల సందేహా ల‌కు పుల్ స్టాప్ ప‌డిపోయింది. ఆయ‌నపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసే వాళ్లు కూడా నేటి స‌న్నివేశంతో నోటికి తాళం వేసుకునేలా చేసారు.

మ‌ళ్లీ నోట ఆ ర‌క‌మైన విమ‌ర్శ రాకుండా చేసారు. దీంతో అభిమానులు సంతోషంలో క‌నిపిస్తున్నారు. వాళ్ల‌కి ఎక్క‌డో చిన్న సందేహం ఉండేది. ఆ డౌట కూడా క్లియ‌ర్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న కొన్ని సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. వాటి షూటింగ్ ల్లో పాల్గొంటునే తాన ల‌క్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు.