Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 156వ చిత్రంపై అవ‌న్నీ పుకార్లే

కానీ ఈ పుకార్లను ఖండిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   25 July 2023 5:39 PM GMT
మెగాస్టార్ 156వ చిత్రంపై అవ‌న్నీ పుకార్లే
X

టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ‌రుస సినిమాల‌ తో 'ఫ్యాక్ట‌రీ మోడ‌ల్'ని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసిన గ‌ట్సీ నిర్మాణ సంస్థ‌. ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే నాలుగైదు సినిమాల క‌థ‌ల్ని ఓకే చేసి వెంట వెంట‌నే సెట్స్ పైకి తీసుకెళ్లే రియ‌ల్ ఛాలెంజర్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం స‌ద‌రు నిర్మాణ సంస్థ టాలీవుడ్ అగ్ర హీరోల‌తో సినిమాలు చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 25వ చిత్రం 'బ్రో'ని నిర్మించిన పీపుల్స్ మీడియా ఈ శుక్రవారం సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తోంది. బ్రో ప్రమోషన్స్ సమయం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వ ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలనే తన కలను వ్యక్తం చేశారు.

లెజెండరీ చిరంజీవితో కలిసి ఉండాలనేది తన పెద్ద కల అని చెప్పాడు. అయితే ఈ మధ్యాహ్నం నుంచి మెగాస్టార్ 156పై ఓ రూమర్ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రాన్ని సుస్మిత కొణిదెల నేతృత్వం లోని గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సహనిర్మాతగా నిర్మిస్తుందనేది ఈ రూమ‌ర్ సారాంశం.

కానీ ఈ పుకార్లను ఖండిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడైనా మెగాస్టార్ తో సినిమా చేయడానికి చాలా సంతోషిస్తుంది. అయితే సోషల్ మీడియా లో ప్రస్తుతం వస్తున్న పుకార్లు పూర్తిగా ఊహాజనితాలు మాత్ర‌మే.. ఇవేవీ నిజం కాదు'' అని అధికారిక ప్రకటనలో పేర్కొంది. మెగాస్టార్ 156కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ని పీపుల్స్ మీడియా తాజా ప్ర‌క‌ట‌న స్ప‌ష్ఠం చేస్తోంది.